Weather Update: తెలంగాణలో ఇవాళ పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..రేపు కుంభవృష్టి : వాతావరణశాఖ

తెలంగాణలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 7-9 మధ్య కూడా అతిభారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • Written By:
  • Updated On - August 5, 2022 / 10:24 AM IST

తెలంగాణలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 7-9 మధ్య కూడా అతిభారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. 7న 12 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 8, 9 తారీఖుల్లో అంతకుమించి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలీమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అకాశం ఉండటంతో ప్రభుత్వానికి, జాతీయ విపత్తు నిర్వహణ NDRFసమాచారం ఇచ్చినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా 7న లేదంటే ఆ తర్వాత వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.