Site icon HashtagU Telugu

TS: ఈ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు…ఎల్లో అలర్ట్ జారీ…!!

Heavy Rains

Heavy Rains

గతకొన్నాళ్లుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ లోని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణపై నైరుతీ రుతుపవనాలు చురుకుగా కొనసాగుతున్నాయి. దీంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు తెలంగాణలో ఆదిలాబాద్ కొమురంభీమ్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

కాగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మహబూబాబాద్ , జనగామ, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి, సిద్ధిపేట, వరంగల్ , ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, మంచిర్యాల, మెదక్, నిర్మల్ , సూర్యపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి.