Site icon HashtagU Telugu

Rain Alert : వామ్మో…హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన..

Heavy Rain Start In Hyderabad

Heavy Rain Start In Hyderabad

హైదరాబాద్ (Hyderabad) వాసులకు బిగ్ అలర్ట్ ..నగరంలో మళ్లీ వాన (Rain) మొదలుకావడం..అది కూడా ఆఫీస్ ల నుండి వచ్చే సమయంలో వర్షం వస్తుండడంతో అంత భయపడుతున్నారు. నిన్న కూడా ఇదే సమయంలో వర్షం పడి నగరాన్ని అతలాకుతలం చేసింది. ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో సోమవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది. దాదాపు గంట సేపు పడిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.

గచ్చిబౌలి, ఐకియా, సైబర్‌ టవర్స్‌ మాదాపూర్‌ సహా నగర వ్యాప్తంగా రోడ్లు, ఫ్లై ఓవర్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జాం(Traffic jam) అయ్యింది. ఆఫీసులు, విద్యాసంస్థల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోయి ఎటూ కదలలేక నరకయాతన అనుభవించారు. ఐటీ కారిడార్‌(IT Corridor)లో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారడం, వాహనాలు ముందుకు కదల్లేని స్థితికి చేరాయి. చాలామంది అర్ధరాత్రి సమయానికి ఇంటికి చేరుకున్నారు.

సోమవారం రాత్రి 10 గంటల వరకు రాజేంద్రనగర్‌ మండలం శివరాంపల్లిలో 6.48 సెం.మీ, చార్మినార్‌ 6.33 సెం.మీ. గోల్కొండ 5.85 సెం.మీ., అంబర్‌పేట 5.75 సెం.మీ., బహదూర్‌పుర 5.65 సెం.మీ. శేరిలింగంపల్లి 5.43 సెం.మీ. ఖైరతాబాద్‌ 5.1 సెం.మీ, షేక్‌పేట 4.9 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు. అలాగే పలు చెరువులు మత్తడి పోస్తుండడం తో పలు ప్రాంతాల్లో భారీగా నీరు వచ్చి చేరింది. నగరంలో చాల కాలనీ లు ఇంకా నీటిలో ఉండగా..ఇక ఇప్పుడు మరోసారి వర్షం పడుతుండడం తో నగరవాసులు ఖంగారు పడుతున్నారు.

మరోపక్క సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు (Cyberabad Traffic Police) నగర పరిధిలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. రేపు ఐటీ ఉద్యోగులు మూడు విడుతల్లో లాగౌట్‌ చేయాలని సూచించారు. ఐకియా – సైబర్‌ టవర్స్‌ వరకు ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటలకు లాగౌట్‌ చేయాలని, ఐకియా – బయోడైవర్సిటీ వరకు ఐటీ ఆఫీసుల్లో సాయంత్రం 4.30 గంటలకు లాగౌట్‌ చేయాలని సూచించారు. ఐకియా – రాయదుర్గం వరకు ఐటీ ఆఫీసుల్లో సాయంత్రం 4.30 గంటలకు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య లాగౌట్‌ చేయాలని కోరారు. గచ్చిబౌలి ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య లాగౌట్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: Fatal Accident : మైహోమ్ సిమెంట్‌ కంపెనీ లో ఘోర ప్రమాదం ..ఐదుగురి మృతి