Heavy Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

భారీ వర్షం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 05:41 PM IST

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో సోమవారం సాయంత్రం వర్షం (Rain) దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు వాతావరణం అంత వేడిగా ఉండగా..సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. భారీ పెనుగాలులకు పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకపూల్‌, అమీర్‌పేట, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, లంగర్‌హౌస్‌, గండిపేట, శివరాంపల్లిలో భారీ వర్షం నమోదైంది. అలాగే పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, గచ్చిబౌలి, మణికొండ, షేక్‌పేట, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

We’re now on WhatsApp. Click to Join.

ఒక్కసారి వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక భారీ వర్షం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దంటూ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ బల్దియా సూచించింది.. రాగల గంటపాటు నగరవ్యాప్తంగా భారీ వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గోల్కొండ తాశీల్దార్ కార్యాలయం ప్రాంతంలో ఐదున్నర సెంటీమీటర్లు, లంగర్ హౌస్ ప్రాంతంలో నాలుగున్నర సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఫిలింనగర్ కృష్ణానగర్ షేక్ పేట ప్రాంతాల్లో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జూబ్లీహిల్స్, అత్తాపూర్ ప్రాంతాల్లో మూడు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read Also : Sidda Raghava Rao : వైసీపీలో ఊపందుకున్న రాజీనామాల పర్వం