Emergency Numbers: హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సంప్రదించాల్సిన అత్యవసర ఫోన్ నంబర్లను (Emergency Numbers) అధికారులు ప్రకటించారు. గత కొన్ని గంటలుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు సహాయం అందించే ఉద్దేశ్యంతో వివిధ విభాగాల హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది.
అత్యవసర సహాయం, విపత్తు నిర్వహణ
వరదల కారణంగా ఎవరైనా ఇబ్బందులు పడితే, సహాయం కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు:
- NDRF (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం): 8333068536
- ఐసీసీసీ (ఇంటెగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్): 8712596106
- ఈ బృందాలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయాన్ని అందిస్తాయి.
Also Read: Hydraa : హైటెక్ సిటీ వద్ద చెరువునే కబ్జా చేయాలనీ చూస్తే.. హైడ్రా ఏంచేసిందో తెలుసా..?
ట్రాఫిక్- పోలీసుల సహాయం
వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం సర్వసాధారణం. అలాంటి సమయాల్లో పోలీసుల సహాయం కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు.
- హైడ్రా: 9154170992
- ట్రాఫిక్ హెల్ప్‌లైన్: 8712660600
- సైబరాబాద్ పోలీసులు: 8500411111
- రాచకొండ పోలీసులు: 8712662999
ఈ నంబర్ల ద్వారా ట్రాఫిక్ పోలీసులు మరియు స్థానిక పోలీసులు సహాయం అందిస్తారు.
మున్సిపల్, నీరు, విద్యుత్, రవాణా సేవలు
- GHMC (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్): 8125971221
- HMWSSB (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు): 9949930003
వీటితో పాటు విద్యుత్ సరఫరా అంతరాయాలు ఏర్పడితే TGSPDCL (తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ) హెల్ప్‌లైన్ నెంబర్ 7901530966 కు కాల్ చేయవచ్చు. అలాగే రవాణా సౌకర్యాల గురించి తెలుసుకోవడానికి RTC హెల్ప్‌లైన్ నంబర్ 9444097000 ను సంప్రదించవచ్చు. ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని, అత్యవసర సమయాల్లో ఈ నంబర్లను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.