Site icon HashtagU Telugu

Heavy Rain In Hyderabad: హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం..!

Heavy Rain In Hyderabad

Heavy Rain In Hyderabad

Heavy Rain In Hyderabad: తెలంగాణ‌లో వ‌ర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం )Heavy Rain In Hyderabad) కురుస్తుంది. రాష్ట్ర రాజ‌ధాని అయిన హైద‌రాబాద్‌లో గ‌త గంట నుంచి ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం భారీగా కురుస్తోంది. ఈ వ‌ర్షానికి లోత‌ట్లు ప్రాంతాలు జ‌ల‌మ‌య్యాయి. ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. రోడ్ల‌పైనే వ‌ర్షపు నీరు నిల‌వ‌డంతో ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జామ్ కావ‌డంతో ప్ర‌యాణికులు వ‌ర్షంలోనే వేచి ఉండే ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ క్ర‌మంల‌నే జీహెచ్ఎంసీ అధికారులు ప‌లు ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బ‌య‌టికి రావొద్ద‌ని న‌గ‌ర వాసుల‌ను హెచ్చ‌రిస్తున్నారు. మాదాపూర్, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్, హైటెక్ సిటీ, దిల్‌సుఖ్ న‌గ‌ర్‌, చైత‌న్య‌పురి, కొత్త‌పేట‌, ఎల్బీ న‌గ‌ర్‌ ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఈ ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read: KTR Interesting Tweet: మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ఈ జిల్లాల‌కు వర్ష సూచ‌న‌

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ప్రకటించారు. జూన్ 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. IMD ప్రకారం.. తూర్పు తెలంగాణలో సాయంత్రం మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో రాత్రి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఏపీలో ప‌రిస్థితి ఇదీ..!

ఇక ప‌క్క రాష్ట్ర‌మైన ఏపీలో కూడా మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల సమయంలో ఈ ప్రాంతాల్లోని నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అమ‌రావ‌తి IMD కేంద్రం సూచించింది. వాతావరణ శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైన మేరకు నవీకరణలను అందజేస్తామ‌ని ఐఎండీ అధికారులు తెలిపారు.