హైదరాబాద్‌లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నగరంలో భారీ వర్షాలు కొనసాగుతాయని సమాచారం. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా వాతావరణ శాఖ నగరంలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి మొత్తం ఆరు జోన్‌లలో జూలై 23 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో జులై 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తూ.. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. నగరంలోని కొన్ని చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్‌లు జారీ చేయడంతో పాటు సకాలంలో హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. గత 24 గంటల్లో జనగాంలో అత్యధికంగా 192.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) నివేదిక ప్రకారం హైదరాబాద్‌లోని షేక్‌పేటలో 68.8 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.
Hyderabad : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. నీటమునిగిన పలు ప్రాంతాలు

Hyd Rains Imresizer