హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి భారీ వర్షం (Heavy Rain) పడుతుంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వరకు తీవ్రంగా ఎండకొట్టగా..సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లపడి వర్షం మొదలైంది. తార్నక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, ముషీరాబాద్, చంపాపేట, సైదాబాద్, సరూర్‌నగర్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంపేట, అబిడ్స్, చాంద్రయాణగుట్ట, ఫలుక్‌నుమా, చార్మినార్ వద్ద వర్షం పడుతున్నది.
బహదూర్‌పుర, ఉప్పుగూడ, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, బోయిన్‌పల్లి, అల్వాల్, చిలకలగూడ, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేటలో వర్షంపడుతున్నది. ఒక్కసారిగా వర్షం కురవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా రోడ్లపైకి వాహనాలు చేరాయి. వర్షం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మెట్రో లైన్లు, స్టేషన్ల కింద వాహనదారులు ఉండిపోయారు. మరోగంటపాటు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రల్లో భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం తుపాను తరహా సుడిగాలులు బంగాళాఖాతంపై ఉన్నాయన్నారు. వీటి వల్ల అల్పపీడనం వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో నేటి నుంచి మరో మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నయని హైదరాబాద్ వాతవరణ శాఖ హెచ్చరించింది.
Read Also : Tirupati Laddu Row : తిరుమల లడ్డూల వివాదం.. తమిళనాడు కంపెనీకి షోకాజ్ నోటీసులు..!