హైదరాబాద్ (Hyderabad) లో కుంభవర్షం (Heavy Rain) కురుస్తుంది. గురువారం ఉదయం నుండి ఎండ దంచికొట్టగా..సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సడెన్ గా కారుమబ్బులు కమ్ముకుపోయి..ఈదురుగాలులతో వర్షం మొదలైంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా జోరుగా వర్షం కురుస్తుండడం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన పనిలేదు..సరిగ్గా ఆఫీస్ లు అయిపోయి..ఇంటికే వెళ్లే సమయం కావడం తో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది.
We’re now on WhatsApp. Click to Join.
శేరిలింగంపల్లి, మియాపూర్, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, అమీర్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, ఆల్వాల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. అలాగే డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాదారులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. గుమ్మడిదలలో అత్యధికంగా 9.1 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైందని అధికారులు చెప్తున్నారు. మరోపక్క GHMC సైతం అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపింది. ఇక తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది.
Read Also : IndiGo: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో ఎయిర్‌లైన్స్..!