Site icon HashtagU Telugu

Heavy Rain in Hyd : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం

Heavy Rain Start In Hyderabad

Heavy Rain Start In Hyderabad

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో శుక్రవారం సాయంత్రం నుండి వర్షం (Rain) దంచికొడుతుంది. మధ్యాహ్నం వరకు వాతావరణం అంత వేడిగా ఉండగా..సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం పడడం స్టార్ట్ అయ్యింది. భారీ పెనుగాలులకు పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకపూల్‌, అమీర్‌పేట, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, లంగర్‌హౌస్‌, గండిపేట, శివరాంపల్లిలో భారీ వర్షం నమోదైంది. అలాగే పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, గచ్చిబౌలి, మణికొండ, షేక్‌పేట, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

We’re now on WhatsApp. Click to Join.

సరిగ్గా అంత తమ తమ పనులు పూర్తీ చేసుకొని ఇంటికి వెళ్లే సమయంలో వర్షము పడడం తో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయం కావడంతో ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం అయ్యింది. ఇది ఈక్రమంలో GHMC నగరవాసులకు అలర్ట్ జారీ చేసారు. వర్షపు భారీగా చేరడంతో నాళాలు పొంగే అవకాశం ఉందని, అటు వైపు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. కరెంట్ స్తంభాల దగ్గరకూ వెళ్లరాదని తెలిపారు. వర్షం పడే సమయంలో చిన్న పిల్లలను బయటకు పంపొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఆఫీసుల నుంచి వెళ్లే వారు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఇదిలా ఉంటె రాగాల మూడు రోజుల పాటు తెలంగాణ లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also : Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇకలేనట్లేనా..? హరీష్ శంకర్ ఏమన్నాడంటే..!!