Heavy Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం

ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Hyd Rains

Hyd Rains

హైదరాబాద్ (Hyderabad) మహానగరాన్ని మరోసారి భారీ వర్షం (Heavy Rain) ముచ్చెత్తింది. హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్‌, కోఠి, చార్మినార్‌, బేగంబజార్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌, హిమాయత్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే రెడ్ అలర్ట్ ఇష్యూడ్ ఫర్ హైదరాబాద్ అంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ చేశారు. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షానికి ఎక్కడిక్కడే వాహనాలు ఆగిపోయాయి. ఆఫీస్ లను , స్కూల్స్ , కాలేజీల నుండి ఇంటికి వెళ్తున్న వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక గణేశుడి నిమజ్జనానికి వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయని..అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరారు.

Read Also : Manipur violence: మణిపూర్‌లో మొదలైన హింసాత్మక ఘటనలు

  Last Updated: 27 Sep 2023, 06:53 PM IST