Site icon HashtagU Telugu

Heavy Rain in Hyd : హైదరాబాద్ పై విరుచుకుపడ్డ వరుణుడు

Rainhyd

Rainhyd

హైదరాబాద్ (Hyderabad) నగరంపై వరుణుడు విరుచుకుపడడంతో శుక్రవారం సాయంత్రం నుండి నగర జీవనం దాదాపు స్థంభించిపోయింది. మేడ్చల్‌లో 7.7 సెం.మీ, బహదూర్పుర్లో 7.6, జూపార్క్ వద్ద 6.9, నాంపల్లి ప్రాంతంలో 6.1, బండ్లగూడలో 5.2 సెం.మీ వర్షపాతం నమోదవడం వర్షం తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. గంటపాటు కురిసిన ఈ కుండపోత వర్షం నగరంలోని తక్కువ ఎత్తైన ప్రాంతాల్లో నీటి ముంపుకు దారితీసింది. ఇళ్లలోకి నీరు చేరడంతో పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అలాగే పంజాగుట్ట-మాదాపూర్, బేగంపేట-సికింద్రాబాద్, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్‌పల్లి, పటాన్ చెరువు, కేపీహెచ్‌బీ వంటి ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. వందలాది వాహనదారులు రోడ్లపై గంటల తరబడి నిలిచిపోయారు. అత్యవసర సేవలు అందించాల్సిన అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన సందర్భాలు వెలుగుచూశాయి. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ బలహీనత మరోసారి బయటపడటంతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

OG Ticket : ‘OG’ మూవీ టికెట్ రేట్స్ పెరిగింది..వివాదం మొదలైంది

అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. రాత్రంతా కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయానికి విపత్తు నిర్వహణ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వర్షాల కారణంగా పౌరులు అనవసర ఆందోళన చెందకుండా ఇంట్లోనే ఉండాలని, ఎలక్ట్రిక్ వైర్లు లేదా నీటితో మునిగిపోయిన రోడ్లను దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పునరావృతం చేస్తున్నారు. ఈ పరిస్థితి మరోసారి హైదరాబాద్ మౌలిక వసతుల బలహీనతను, నగర ప్రణాళికలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది.

Exit mobile version