Protest with Snake: వీడు మాములోడు కాదు.. పాముతో అధికారులకు నిరసన సెగ!

అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము రావడంతో కుటుంబ సభ్యలు ఆందోళన చెందారు.

  • Written By:
  • Updated On - July 26, 2023 / 05:20 PM IST

Hyderabad: ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులను కాంటాక్ట్ అయితే పట్టనట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇక గవర్నమెంట్ అధికారుల షరమామూలే అని చెప్పక తప్పదు. చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోరు. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజులుగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలు ప్రాంతాల్లోని ఇళ్లు జలమయమయ్యాయి. కొన్ని ఇండ్లలో విష సర్పాలు సైతం వచ్చాయి. మురుగు నీరు ఇళ్లలోకి వస్తోంది కూడా. అయితే అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము రావడంతో కుటుంబ సభ్యలు ఆందోళన చెందారు.

దీంతో వెంటనే కుటుంబ సభ్యుడు అధికారులకు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. GHMC అధికారులకు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.  అయితే 6 గంటలు గడిచినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సంపత్ కుమార్ అనే యువకుడుకి ఓపిన నశించింది. ఆగ్రహంతో  అల్వాల్ GHMC వార్డు ఆఫీసుకు పామును తీసుకొని వెళ్లి షాక్ ఇచ్చాడు. టేబుల్ పై పామును పెట్టి నిరసన తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడు మాములోడు కాదండోయ్ అంటూ, పాముతో భలే నిరసన అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Pawan Kalyan: కోలీవుడ్ పెద్దలకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్.. కారణమిదే!