Site icon HashtagU Telugu

Heavy Heat Waves in Telangana : నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 19 మంది మృతి

Tg Sun

Tg Sun

తెలంగాణ లో ఎండలు (Heavy Heat Waves) ఏ రేంజ్ లో కొడుతున్నాయో తెలియంది కాదు నిన్న ఏకంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంది. ఈరోజు , రేపు లోపు 50 డిగ్రీలకు చేరుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ఎండలకు తట్టుకోలేక చాలామంది మృత్యువాత పడుతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 19 మంది మృతి (19 Deaths Sunstroke) చెందారంటే అర్ధం చేసుకోవాలి.

ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుండే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మొదలయ్యాయి. ఏప్రిల్ చివరి వారంలో అయితే మరింత ముదిరిపోయాయి. ఎంతలా అంటే 103 ఏళ్ల రికార్డు ను బ్రేక్ చేసాయంటే అర్ధం చేసుకోవాలి..ఏ రేంజ్ లో ఎండలు దంచికొడుతున్నాయో.. ఇక్కడ..అక్కడ అనే తేడాలు లేకుండా అనేక జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఈ ఎండా వేడి తట్టుకోలేక ముసలి వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు వడదెబ్బ కు చనిపోతున్నారు. మరో 4 రోజులు వాతావరణ పరిస్థితి ఇలాగే ఉంటుందని.. కొన్నిచోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు 45 – 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం 58 మండలాల్లో తీవ్ర వడగాలులు, 169 మండలాల్లో వడగాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఎండలకు తాళలేక దినసరి కూలీలు, రైతులు, వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. శనివారం ఒక్కరోజే పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతి చెందారు.

We’re now on WhatsApp. Click to Join.

కరీంనగర్ (Karimnagar) జిల్లా చొప్పదండి (Choppadandi) పట్టణానికి చెందిన ఎంఈవో బత్తుల భూమయ్య (57) శనివారం తెల్లవారుజామున వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామానికి చెందిన రైతు దయ్యాల జంగమ్మ (58) మధ్యాహ్నం ఆర్టీసీ బస్సెక్కి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. సీటులోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్ కు చెందిన వంక లక్ష్మి (70), భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన మేకల లక్ష్మయ్య (56), కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలానికి చెందిన బొల్లబోయిన వనమాల (45), జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందిన కొమురం సోము (58) ఎండదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 19 మంది మృతి చెందారు.

Read Also : Tamilisai : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమిళసై కీలక వ్యాఖ్యలు