Fire Accident : ఆరాంఘర్లో భారీ అగ్నిప్రమాదం..ఆ ప్రాంతమంతా చీకటిమయం

Fire Accident : ఆరాంఘర్లో భారీ అగ్నిప్రమాదం..ఆ ప్రాంతమంతా చీకటిమయం

Published By: HashtagU Telugu Desk
Heavy Fire Accident At Aram

Heavy Fire Accident At Aram

సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని (Hyderabad) ఆరాంఘర్లో (Aramghar ) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. మహీంద్రా షోరూం వెనుక ప్రాంతంలోని బస్సుల స్క్రాప్ గోదాం (Bus Scrap Godam)లో మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించడం తో ఆ ప్రాంతమంతా చీకటి మయంగా మారింది. ఈ ప్రమాద విషయం తెలియగానే అగ్ని మాపక సిబ్బంది , పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేప్రయత్నం మొదలుపెట్టారు. ఈ ప్రమాదం వల్ల కోట్లలో ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. దట్టమైన పొగ కమ్ముకోవడంతో శివరాంపల్లి ఆరాంఘర్ చౌరస్తాలో ట్రాఫిక్ కాసేపు నిలిచిపోయింది. వాహనదారులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. మరోపక్క దట్టమైన పొగ కమ్మేయడంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గత కొద్దీ నెలలుగా నగరంలో వాణిజ్య ప్రాంతాల్లో, పారిశ్రామిక ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు అనేవి తరుచు జరుగుతూ ఉన్నాయి. అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణాలు సహజంగా నిర్లక్ష్యంగా ఉన్న భద్రతా ప్రమాణాలు, అగ్ని నిరోధక సదుపాయాల కొరత, మరియు విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు. అగ్ని ప్రమాదాలకు సంబంధించి నగర అగ్ని మాపక శాఖ తరచుగా స్పందిస్తూ, సహాయక చర్యలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ అధికారులు మరియు మునిసిపల్ సంస్థలు ఈ సమస్యను నియంత్రించడానికి, మరింత కఠినమైన అగ్ని భద్రతా నిబంధనలను తీసుకురావడం, వాటి అమలు పట్ల శ్రద్ధ చూపడం వంటి చర్యలను చేపడుతున్నప్పటికీ , చాలామంది నిర్లక్ష్యం వహిస్తుండడం ఈ ప్రమాదాలు జరగడం , భారీగా ఆస్థి , ప్రాణ నష్టం వాటిల్లడం జరుగుతుంది.

Read Also : Miraya Vadra : మిరాయా వాద్రా ఎవరో తెలుసా ? ప్రియాంకకు మద్దతుగా ప్రచారం

  Last Updated: 11 Nov 2024, 03:34 PM IST