Akkineni Nagarjuna : నేడు నాంపల్లి కోర్టులో నాగార్జున పిటిషన్ పై విచారణ

Akkineni Nagarjuna : శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా జడ్జి లీవ్‌లో ఉండటంతో ఈరోజుకు వాయిదా పడింది. కోర్టు ఎలా స్పందిస్తుందోననే సర్వత్ర ఉతర్కంఠ నెలకొంది. తన ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది.

Published By: HashtagU Telugu Desk
Hearing on Nagarjuna petition in Nampally court today

Hearing on Nagarjuna petition in Nampally court today

Nampally Court : నేడు నాంపల్లి కోర్టులో హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ విచారణ జరుగనుంది. తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు . ఈ తరుణంలోనే.. మంత్రి కొండా సురేఖ మీద నాగర్జున పిటిషన్ పై నేడు విచారణ జరుగనుంది. నాగార్జున కుటుంబ పై ఇటీవల కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Read Also: Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్, మాధురి

కాగా, శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా జడ్జి లీవ్‌లో ఉండటంతో ఈరోజుకు వాయిదా పడింది. కోర్టు ఎలా స్పందిస్తుందోననే సర్వత్ర ఉతర్కంఠ నెలకొంది. తన ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది. సమంత విడాకుల్లో తన ప్రమేయం ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు.

అధారాలు లేకుండా ఇలాంటి కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ టాలీవుడ్ ప్రముఖులు రియాక్ట్‌ అయ్యారు. ఈ విషయంలో నాగార్జునకు చాలామంది సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే చాలామంది సినీ నటులు స్పందించడంతో కొండా సురేఖ స్పందిస్తూ కాస్త వెనక్కు తగినట్టుగా తెలుస్తోంది. అక్కినేని ఫ్యాన్స్ సైతం ఈ విషయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో కొండా సురేఖ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె అక్కినేని కుటుంబానికి క్షమాపణలు తెలపాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో.. సమంత, నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. నాగార్జున, నాగచైతన్య పేర్లు ప్రస్తావిస్తూ అభ్యంతరకర ఆరోపణలు చేయటంతో సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర దూమారం రేగింది. ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండేందుకు సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించేందుకు నాగార్జున, నాగచైతన్య బలవంతపెట్టారని, దీనికి సమంత నిరాకరించడం విడాకులకు దారితీసిందని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేయటంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ మీద కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

Read Also: Jr NTR: తన పిల్లల యాక్టింగ్ పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్

 

  Last Updated: 07 Oct 2024, 11:45 AM IST