Harishrao On Duty : ఆస్ప్రతుల్లో తనిఖీలు.. వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా!

తెలంగాణ ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న తన్నీరు హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్న విషయం విధితమే. గతంలో ఈ శాఖను నిర్వహించిన ఇద్దరు మంత్రులపై ఆరోపణలు రావడం..

  • Written By:
  • Updated On - November 30, 2021 / 12:19 PM IST

తెలంగాణ ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న తన్నీరు హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్న విషయం విధితమే. గతంలో ఈ శాఖను నిర్వహించిన ఇద్దరు మంత్రులపై ఆరోపణలు రావడం.. ఉద్వాసనకు గురికావడంతో అందరి కళ్లు హరీశ్ రావు వైపే చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఎప్పటికప్పుడు వైద్య సమీక్షలు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

కొత్త వేరియంట్‌, థర్డ్‌వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వేరియంట్‌పై మంత్రి హరీష్‌ రావు అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అయితే ఆయా దేశాల నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానాలు లేని కారణంగా ముంబై, ఢిల్లీలో దిగి హైదరాబాద్‌కు వచ్చే వారిని ట్రేసింగ్‌ చేసి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

తాజాగా ఆయన పలు ప్రాంతీయ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాస్పత్రిలో సదుపాయాలు ఏవిధంగా ఉన్నాయో ఆరా తీశారు. అంతేకాకుండా వైద్య సిబ్బంది సమయ పాలనతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. వైద్య నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు.