Site icon HashtagU Telugu

Dengue : తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి – కేటీఆర్

Dengue Telangana Hospitals

Dengue Telangana Hospitals

తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు (Dengue fever) ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు డెంగ్యూ తో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పట్నం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్ర వ్యాప్తంగా 5,500 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నప్పటికీ..రాష్ట్ర వ్యాప్తంగా వేల డెంగ్యూ కేసులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం డెంగ్యూ కేసుల సంఖ్య తక్కువగా చెపుతుందని బిఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తుంది.

తాజాగా డెంగ్యూతో ప్రజలు చనిపోతున్నా ఇప్పటివరకు మరణాలేమీ లేవని ప్రభుత్వం బుకాయించడం దారుణమని మాజీ మంత్రి KTR మండిపడ్డారు. ‘నిన్న ఐదుగురు, ఈరోజు ముగ్గురు చనిపోయారని వార్తా కథనాలు స్పష్టంగా పేర్కొన్నాయి. డాటాను ఎందుకు దాస్తున్నారు? ఆసుపత్రుల్లో మందులు లేవు. ఒక్క బెడ్ను 3-4 పేషెంట్లు షేర్ చేసుకుంటున్నారు. పరిస్థితిని తీవ్రంగా పరిగణించి, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే సమయం వచ్చింది’ అని ఆయన ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

Read Also : Chanakya Niti : భార్యాభర్తలకు చాణక్యుడు చెప్పిన నీతిసూత్రాలివీ..