Site icon HashtagU Telugu

Health Director : పొలిటిక‌ల్ డాక్ట‌ర్‌, తెలంగాణ హెల్త్‌ డైరెక్ట‌ర్

Health Director

Health Director

తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు(Health Director) మ‌రోసారి వివాదంలో చిక్కుకున్నారు. వైద్యులు  త‌గ్గించ‌లేని జ‌బ్బును తాయెత్తు త‌గ్గిస్తుంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దీంతో వైద్యులు ఆయ‌న మీద మండిపడుతున్నారు. చిన్నప్పుడు వైద్యులు ఎవ‌రికీ త‌గ్గ‌ని జబ్బు ఒక తాయెత్తు క‌ట్టించ‌డం ద్వారా త‌గ్గింద‌ని  శ్రీనివాస‌రావు(Srinivasa Rao) వెల్ల‌డించారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా కొత్త‌గూడెంలో జ‌రిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయ‌న వివాద‌స్ప‌ద కామెంట్లు చేయ‌డం రాజ‌కీయ ర‌చ్చ‌ను రేపుతోంది.

తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు మ‌రోసారి వివాదం(Health Director)

ఇటీవ‌ల రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక డాక్ట‌ర్ కంటే రాజ‌కీయ నాయ‌కునిగా ప్ర‌జ‌ల‌కు సేవ ఎక్కువ‌గా చేయొచ్చ‌ని శ్రీనివాస‌రావు(Health Director) ఆ మ‌ధ్య అన్నారు. అంటే, రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న చేస్తున్నార‌ని అంద‌రూ భావించారు. అంతేకాదు, ఒకానొక సంద‌ర్భంలో కేసీఆర్ ఎక్క‌డ పోటీ చేయ‌మంటే అక్క‌డ నుంచి చేస్తాన‌ని శ్రీనివాస‌రావు (Srinivasa Rao)వెల్ల‌డించారు. దీంతో రాజ‌కీయాల్లోకి రావడానికి హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు ఫిక్స్ అయ్యార‌ని అంద‌రికీ తెలిసింది. ఆ క్ర‌మంలోనే ముస్లింలు, క్రిస్టియ‌న్ల‌ను త‌న వైపు తిప్పుకోవ‌డానికి వివాద‌స్ప‌ద కామెంట్లు చేస్తూ త‌ర‌చూ ర‌చ్చ‌కు ఎక్కుతున్నారు.

వైద్యులు  త‌గ్గించ‌లేని జ‌బ్బును తాయెత్తు త‌గ్గిస్తుంద‌ని

గ‌త ఏడాది ప్రీ క్రిస్ట‌మ‌స్ వేడుక‌ల‌కు కొత్త‌గూడెం వ‌ద్ద హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా కోవిడ్ -19 త‌గ్గ‌డానికి కార‌ణం జీస‌స్ అంటూ కామెంట్ చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా జీస‌స్ ద‌య కార‌ణంగా క‌రోనా కంట్రోల్ లోకి వ‌చ్చింద‌ని అన్నారు. దీంతో ఆర్ఎస్ఎస్, విశ్వ‌హిందూ ప‌రిష‌త్ త‌దిత‌ర హిందూ సంస్థ‌లు ఆయ‌న మీద ఆగ్ర‌హించాయి. మ‌తాన్ని రెచ్చ‌గొట్టేలా శ్రీనివాస‌రావు(Srinivasa Rao) చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. ఆయ‌న మీద న్యాయ‌పోరాటం చేయ‌డానికి ఆ సంస్థ‌లు స‌న్న‌ద్ధం అయ్యాయి. మ‌ళ్లీ ఇప్పుడు తాజాగా తాయెత్తు అంశాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. దీంతో మ‌రింత‌గా హిందూ సంస్థ‌లు ఆయ‌న మీద మండిప‌డుతున్నాయి.

ఉద్యోగులు కేసీఆర్ కాళ్లు  ప‌ట్టుకుంటున్నారు 

రాజ‌కీయాల్లోకి రావాల‌నుకునే ఉద్యోగులు కేసీఆర్ కాళ్లు(Health Director  ) ప‌ట్టుకుంటున్నారు. ఆయ‌న ప్ర‌స‌న్నం కోసం పాట్లు ప‌డుతున్నారు. హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు కూడా సీఎం కేసీఆర్ కాళ్లు ప‌ట్టుకున్నారు. ఇటీవ‌ల మెడిక‌ల్ కాలేజి ల‌ను వ‌ర్చువ‌ల్ గా ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా కేసీఆర్ ప్రారంభించారు. ఆ సంద‌ర్భంగా మెడిక‌ల్ డైరెక్ట‌ర్ హోదాలో శ్రీనివాసరావు ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఆ వేదిక మీద కేసీఆర్ కాళ్లు ప‌ట్టుకుని భ‌క్తిని చాటుకున్నారు. ఆ విష‌యంపై నిల‌దీసిన వాళ్ల‌కు స‌మాధానం చెబుతూ బ‌రాబ‌ర్ ఎన్నిసార్లైనా కేసీఆర్ కాళ్లు పట్టుకుంటానని శ్రీనివాస‌రావు(Srinivasa Rao) అన్నారు. ప్ర‌త్యేక తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత అంటూ కితాబు ఇచ్చారు. తెలంగాణ జాతిపిత‌గా కేసీఆర్ ను భావిస్తూ ఎన్నిసార్లైనా కాళ్లు ప‌ట్టుకుంటాన‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Also Read : TRS MLC Polls: మునుగోడు తర్వాత కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఇదే!

గ‌తంలో మెద‌క్ క‌లెక్ట‌ర్ గా ప‌నిచేసిన జనార్థ‌న్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ కాళ్లు( Health Director ) ప‌ట్టుకున్నారు. సీన్ క‌ట్ చేస్తే, ఆయ‌న వీఆర్ఎస్ తీసుకుని ఎమ్మెల్సీ ప‌ద‌విని అందుకున్నారు. ఇప్పుడు అదే పంథాను మెడిక‌ల్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు అనుస‌రిస్తున్నారు. కొత్త‌గూడెం టిక్కెట్ ను ఆశిస్తూ ఆయ‌న సొంత ట్ర‌స్ట్ ద్వారా సేవ‌లు అందిస్తున్నారు. ప‌లు కార్య‌క్ర‌మాల్లో అక్క‌డ పాల్గొంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌ను చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ ఆయ‌న‌కు టిక్కెట్ ఇస్తారా? లేదా అనేది సందిగ్ధం. కానీ, శ్రీనివాస‌రావు(Srinivasa Rao) మాత్రం కేసీఆర్ ను విశ్వ‌సిస్తూ తాయెత్తు మ‌హిమ‌ను ఇప్పుడు బ‌య‌ట‌కు తీశారు. కేసీఆర్ కు కూడా కొన్ని మూఢ న‌మ్మ‌కాలు ఉన్నాయి. వాటికి మ‌ద్ధ‌తు ప‌లుకుతూ మెడిక‌ల్ డైరెక్ట‌ర్ అడుగులు వేస్తున్నారు. ఆ పంథా ఆయ‌న‌కు రాజ‌కీయంగా క‌లిసొస్తుందా? అనేది చూడాలి.

 

Also Read : TS Health Director: సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్.. వీడియో వైరల్!