Prashant Kishore : మోదీ, రాహుల్ గాంధీ ఎవరూ కూడా తన నుంచి రేవంత్ రెడ్డిని కాపాడలేరన్నారు.!

Bihar Election బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బిహార్ అస్లెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేస్తున్నారు. జన సూరజ్ పార్టీ స్థాపించిన ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డ ప్రశాంత్ […]

Published By: HashtagU Telugu Desk
Revanth Reddy Vs Pk

Revanth Reddy Vs Pk

Bihar Election బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బిహార్ అస్లెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేస్తున్నారు. జన సూరజ్ పార్టీ స్థాపించిన ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డ ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ వచ్చి మరీ రేవంత్ రెడ్డిని ఓడిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు.
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy బిహార్ ప్రజల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సందర్భం దొరికిన ప్రతిసారి.. రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతూనే ఉన్నారు ప్రశాంత్ కిషోర్.  దీనిపై ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ. బిహార్ ప్రజలను తక్కువ చేసి హేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తమ గడ్డపై అడుగు పెడితే తరిమి కొడతానని హెచ్చరించారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి వెళ్లి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Modi మోదీ, రాహుల్ గాంధీ ఎవరూ కూడా తన నుంచి రేవంత్ రెడ్డిని కాపాడలేరన్నారు ప్రశాంత్ కిషోర్. బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరి.. అతి కష్టం మీద రేవంత్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. మరోసారి తిరిగి గెలిచే సత్తా రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. అలాగే బీహార్ ప్రజల డీఎన్ఏ తెలంగాణ ప్రజల DNA కంటే తక్కువ అంటూ చిన్న చూపు చూసిన రేవంత్.. ఢిల్లీ వచ్చి మరీ.. తనకు సాయం చేయాలంటూ మూడు సార్లు.. తనను ఎందుకు అడిగారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ, మోదీ ఎవరూ కూడా రేవంత్ రెడ్డిని తన నుంచి కాపాడలేరని స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చి మీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
  Last Updated: 03 Oct 2025, 02:46 PM IST