HCU: హెచ్ సీయూ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. ప్రొఫెసర్ అరెస్ట్!

హైదరాబాద్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులకు పాల్పడినందుకు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

  • Written By:
  • Updated On - December 3, 2022 / 06:05 PM IST

హైదరాబాద్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులకు పాల్పడినందుకు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పారిన్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తోటి విద్యార్థులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ప్రొఫెసర్‌ను “తక్షణమే సస్పెన్షన్‌లో పెట్టినట్టు విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.

కేవలం మాతృభాషలో మాత్రమే మాట్లాడే విదేశీ విద్యార్థిని శుక్రవారం సాయంత్రం విశ్వవిద్యాలయ క్యాంపస్ పరిసరాల్లో ఉన్న ప్రొఫెసర్ నివాసానికి వెళ్లింది. స్టడీస్ కోసం పలు పుస్తకాలు అవసరం కావడంతో అక్కడికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అతను విద్యార్థిని మద్యం సేవించాల్సిందిగా ఒత్తిడి చేశాడు. ఆపై లైంగిక దాడికి ప్రయత్నం చేశాడని యువతి తెలిపింది. ఈ ఘటనపై విద్యార్థి సంఘం రాత్రంతా నిరసనకు దిగింది. విద్యార్థికి మద్దతుగా గుమిగూడి ప్రధాన గేటు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఆ అమ్మాయి మరో ప్రొఫెసర్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె శిల్పవల్లి మీడియాకు తెలిపారు. మేం కేసును దర్యాప్తు చేస్తున్నాం. అయితే ఆ యువతి కేవలం తన మాతృభాషలో మాత్రమే మాట్లాడుతుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఫ్రొఫెసర్ ను అరెస్ట్ చేశాం’ అని DCP అన్నారు. ప్రొఫెసర్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని 354, 354ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.