Site icon HashtagU Telugu

HCU Land Issue : విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్

Hcu Police Lathi Charge

Hcu Police Lathi Charge

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) భూ వివాదం నేపథ్యంలో విద్యార్థుల నిరసనలు ఉదృతమయ్యాయి. యూనివర్సిటీ ఈస్ట్ క్యాంపస్ ప్రాంతంలో భూమిని పరిరక్షించాలనే ఉద్దేశంతో విద్యార్థి సంఘాలు, ఫ్యాకల్టీ సభ్యులు ర్యాలీ చేపట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తుండగా, పోలీసులు వారిపై లాఠీచార్జ్ (Police Lathi Charge) చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. భూమిని అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పగించకూడదని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలనే డిమాండ్‌తో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

2011 World Cup: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి నేటికి 14 ఏళ్లు.. కీల‌క పాత్ర పోషించిన యువీ!

బుధవారం ఉదయం నుంచే యూనివర్సిటీ పరిసరాలను పోలీసులు భారీగా మోహరించారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, బాహ్య వ్యక్తులను లోపలికి అనుమతించకుండా, విద్యార్థులను బయటికి వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల నిరసనతో యూనివర్సిటీ ప్రాంగణం ఉద్రిక్తతతో మారిపోయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ, ప్రభుత్వం విద్యార్థులపై అణిచివేత ధోరణిని అవలంబించిందని ఆరోపిస్తున్నారు.

Nithyananda : నిత్యానంద చనిపోలేదు..క్లారిటీ వచ్చేసింది

పోలీసుల లాఠీచార్జ్ కారణంగా విద్యార్థుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అతి దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులు పోలీస్ జులుం నశించాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల సంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థుల పోరాటం ఇంకా కొనసాగుతుందా? ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.