Smitha Sabharwal : ఐఏఎస్ స్మితా స‌బ‌ర్వాల్ కు ఎదురుదెబ్బ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ కు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి వాడుకున్న రూ. 15ల‌క్ష‌లు తిరిగి ఇవ్వాల‌ని ఆదేశించింది.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 01:31 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ కు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి వాడుకున్న రూ. 15ల‌క్ష‌లు తిరిగి ఇవ్వాల‌ని ఆదేశించింది. ఒకే 90 రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించ‌క‌పోతే, స్మితా స‌బ‌ర్వాల్ నుంచి వ‌సూలు చేయాల‌ని ప్ర‌భుత్వానికి డైరెక్క్ష‌న్ ఇచ్చింది. ఫ్యాష‌న్ షోలు ప్ర‌భుత్వానికి సంబంధంలేనివ‌ని చుర‌క‌లు వేసింది. ఐఏఎస్ స్మితా స‌బ‌ర్వాల్ ఫ్యాష‌న్ షో ఫోటోల‌ను అవుట్ లుక్ ప‌త్రిక ప్ర‌చురించ‌డంపై ప‌రువు న‌ష్టం దావా వేశారు. అందుకోసం కోర్టు ఫీజుల కింద ప్ర‌భుత్వం రూ. 15ల‌క్ష‌లు మంజూరు చేసింది. దానిపై హైకోర్టులో పిల్ దాఖ‌లు అయింది.

విచారించిన కోర్టు ప్రైవేటు ప్యాష‌న్ షో కు ప్ర‌భుత్వానికి సంబంధం ఏమిటి? అంటూ ప్ర‌శ్నించింవి. ఆ షో పూర్తిగా ఒక ప్రైవేటు వ్య‌క్తి నిర్వ‌హించారు. ఫ్యాష‌న్ షోలో స్మిత స‌బ‌ర్వాల్ పాల్గొన్నారు. ఆ మొత్తం వ్య‌వ‌హారాన్ని అధికారికంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని కోర్టు తేల్చేసింది. ప్రైవేటు వ్య‌క్తి ప్రైవేటు సంస్థ‌పై వేస్తే ప్ర‌జా ప్ర‌యోజ‌నం కాద‌న్న హైకోర్టు స్మిత నుంచి రూ.చ 15ల‌క్ష‌లు వ‌సూలు చేయాల‌ని సంచ‌ల‌న తీర్పు చెప్పింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే కోర్టులు సమీక్షించవచ్చ‌ని తెలియ‌చేసింది. అవుట్ లుక్ ప్ర‌తిక స్మిత ఫోటోను ప్ర‌చురించ‌డం ప్ర‌భుత్వానికి సంబంధంలేని విష‌యంగా కోర్టు తేల్చేసింది.