Site icon HashtagU Telugu

TS High Court: ‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్’ విగ్రహాలకు హైకోర్టు ఓకే

Ganesha

Ganesha

రాష్ట్ర ప్రభుత్వం గణేష్ చతుర్థి, దుర్గాపూజల కోసం దేవతా విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) వినియోగాన్ని నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో నగరానికి చెందిన కళాకారులు ఊపిరి పీల్చుకున్నారు. విగ్రహాలలో పిఒపి వాడకాన్ని నిషేధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఆర్టిజన్ సంస్థలు దాఖలు చేసిన పిల్‌కు సంబంధించినది ఈ కేసును విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది.

కెమికల్ విగ్రహాలు ఏర్పాటుచేసుకోవచ్చుని, కానీ పెద్ద పెద్ద నదుల్లో నిమజ్జనం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ పై ఎలాంటి ఉత్తర్వలు జారీ చేయలేదు.  పీఓపీ విగ్రహాలను సరస్సుల్లో నిమజ్జనం చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో అలాంటి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ముందస్తుగా మినీ పాండ్‌లను రూపొందించాలని రాష్ట్రానికి హైకోర్టు సూచించింది.

Exit mobile version