Site icon HashtagU Telugu

Bandi: సీఎం కేసిఆర్ కించపరుస్తూ స్కిట్.. బండి సంజయ్ కు నోటీసులు జారీ..?

6gp6kxv1

6gp6kxv1

తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు 41ఎ సిఆర్ పిసి కింద నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాజాగా భాజపా ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడ లో అమరుల యాది సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం కేసీఆర్ తో పాటుగా ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా స్కిట్లు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి.

దీంతో ఈ కేసులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా నోటీసులు జారీ చేసినట్టు హయత్నగర్ పోలీసులు తెలిపారు. అలాగే బిజెపి నాయకులు రాణి రుద్రమ్మ, దరువు ఎల్లన్న ను హయత్నగర్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అదేవిధంగా ఈ విషయంలో ఇప్పటికే ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణ ని కూడా అరెస్టు చేయగా, అతను బెయిల్ పై విడుదల అయ్యారు. జిట్టా బాలకృష్ణ అరెస్టు జరిగిన రోజే బెయిల్ పై బయటకు వచ్చేశారు. సీఎం కేసీఆర్ అలాగే ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా స్కిట్లు వేశారని ఆరోపణలు రావడంతో పాటు ఫిర్యాదులు అందడంతో వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పోలీసులు.