Prajapalana Update : మీరు ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అప్లై చేశారా ? అయితే మీ కోసమే ఈ అప్‌డేట్. తెలంగాణ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను ప్రస్తుతం ఆయా పథకాలకు సంబంధించిన ప్రభుత్వ వెబ్ సైట్‌లలో నమోదు చేస్తున్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ దరఖాస్తుదారుల డాటా ఎంట్రీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 17లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లాల అధికార యంత్రాంగాలకు రేవంత్ సర్కారు ఆదేశించింది. తక్కువ జనాభా ఉండే చిన్న జిల్లాలలో ఈ ప్రాసెస్ ఇప్పటికే పూర్తయింది. ఎక్కువ జనాభా ఉండే పెద్ద జిల్లాల్లో ఈ ప్రక్రియ ఇంకా జరుగుతోంది. ఈనెల 17లోగా డాటా ఎంట్రీని పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అర్హుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అర్హులైన వారికి ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయించే తేదీల ప్రకారం ఒక్కో పథకం అమల్లోకి వచ్చేస్తుంది. వాటి ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరడం(Prajapalana Update) మొదలవుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అయితే రేషన్‌కార్డు లేనివారి నుంచి తెల్లకాగితంపై దరఖాస్తులు తీసుకున్నారు. ఇలా తీసుకున్న రేషన్ కార్డుల అప్లికేషన్ల వివరాలను నమోదు చేసేందుకు..సంక్షేమ పథకాల వెబ్‌సైట్‌లో ప్రత్యేక కాలమ్ లేదని అంటున్నారు. మిగిలిన గ్యారంటీల కోసం వచ్చిన అప్లికేషన్ల వివరాలను డిజిటల్ చేస్తున్నా.. రేషన్ కార్డు దరఖాస్తుల సమాచారాన్ని ఎంట్రీ చేయడం లేదని చెబుతున్నారు. ఈ లెక్కన రేషన్‌కార్డులు ఉన్నవారి దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అంటే ఐదు గ్యారెంటీలకు స్వీకరించిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తుల్లోనే అర్హులైన వారికి పథకాలను అందించనున్నారు. దరఖాస్తులు సమర్పించని వారు మరో 4 నెలలు అప్లై చేసుకోవచ్చు.
Also Read: AP Cockfights: సంక్రాంతికి రాజకీయ రంగు, 2000 కోట్లు కొల్లగొట్టిన కోడి పందాలు!
ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసిన తరువాతే వాటిని ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. దరఖాస్తుల్లో తప్పులు ఉన్నంత మాత్రన పక్కన పెట్టొద్దని.. తప్పులుంటే దరఖాస్తుదారులకు ఫోన్ చేసి వివరాలను సేకరించాలని సూచించారు. అన్ని డీటేల్స్ తీసుకోన్న తర్వాతే ఆన్లైన్ లో డేటా ఎంట్రీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. ధరణి కారణంగా ఏర్పడిన సమస్యలు పరిష్కరించేందుకు కసరత్తు మొదలైంది. భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం ఇటీవల జరిగింది. ఆన్‌లైన్‌లో చాలా భూములు ఎంటర్ కాలేదని.. ఈ కారణంగా పలువురికి ప్రభుత్వ పధకాలు అందలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సన్నకారు, చిన్నకారు రైతులు భూమి అమ్ముకోవడానికి ఇబ్బందిపడ్డారని అంటున్నారు.