Site icon HashtagU Telugu

CM Revanth Reddy : రేవంత్ రెడ్డికి హ్యాట్సాఫ్ తెలిపిన టీడీపీ నేత

CM Revanth Reddy

తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. ఓ పక్క రాష్ట్ర అభివృద్ధి, ఇచ్చిన హామీలను నెరవేర్చడం తో పాటు భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యముగా హైదరాబాద్ నగరంలో చెరువులను , ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పలు వ్యాపార సంస్ధలను నిర్మించినవారికి షాక్ ఇస్తూ వస్తున్నారు. అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు రేవంత్ సర్కార్ హైడ్రా సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఎవర్ని వదిలిపెట్టడం లేదు.

ఈరోజు మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేసి (N convention Demolition)..చట్టం ముందు అంత సమానమే అని తేల్చి చెప్పింది. దీనిపై ప్రతి ఒక్కరు రేవంత్ సర్కార్ ఫై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) స్పందించారు. దీన్ని సమర్థిస్తూ ఎక్స్ లో ఆయన ఓ పోస్టు పెట్టారు. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆనం హ్యాట్సాఫ్ తెలిపారు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసినందుకు రేవంత్ రెడ్డికి హ్యాట్సాఫ్ అని ఆయన పోస్టు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మాదాపూర్ లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులతో శనివారం ఉదయం హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. హైడ్రా చర్యపై ఎన్ కన్వెన్షన్ యజమాని, ప్రముఖ సినీ నటుడు నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురామ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా అంశాలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఎన్ కన్వెన్షన్ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, పూర్తిగా పట్టాభూమిలోనే నిర్మాణాలు చేపట్టిందని కోర్టుకు వివరించారు. గతంలోనే ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలకు పాల్పడిందని నోటీసులు ఇస్తే దానిపై హైకోర్టును ఆశ్రయించామని, ఆ సమయంలో స్టే కూడా ఉందని, ఆ స్టే నోటీసులను లెక్క చేయకుండా తాజా కూల్చివేతలపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కన్వెన్షన్ హాల్ ను కూల్చివేశారని వాదించారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించారని కోర్టుకు తెలుపగా వాదనలు విన్న న్యాయస్థానం కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also : Chiya and Sabja : చియా, సబ్జా సీడ్స్‌ మధ్య తేడా ఏమిటి, మీరు ప్రయోజనాలను ఎలా పొందుతారు.?