Site icon HashtagU Telugu

Hyderabad : హైద‌రాబాద్‌లో 71 గ్రాముల హ‌షీష్ ఆయిల్ స్వాధీనం.. ఇద్ద‌రు వ్య‌క్తులు అరెస్ట్‌

Crime

Crime

హైదరాబాద్ లో హషీష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ బోవెన్‌పల్లికి చెందిన ఎం నవీన్, అంబర్‌పేటకు చెందిన కె సాయిరామ్ అనే ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం పట్టుకుంది. వారి నుంచి రూ.25 వేల విలువైన 71 గ్రాముల హషీష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ విజయవాడలోని కొందరి నుంచి ఆయిల్‌ను సేకరించి నగరానికి తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు గడించారు. సమాచారం మేరకు నల్లకుంట వద్ద పట్టుకున్నామ‌ని టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ డి సంతోష్ కుమార్ తెలిపారు.మరో కేసులో కాటేదాన్‌కు చెందిన సయ్యద్‌ షర్ఫుద్దీన్‌ (23) అనే వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టుకుని అతడి నుంచి 183 గ్రాముల చరస్‌, 340 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఔరంగాబాద్‌కు చెందిన షర్ఫుద్దీన్ ముంబై నుండి నిషిద్ధ వస్తువులను సేకరించి, నగరంలోని వినియోగదారులకు విక్రయించాలని ప్లాన్ చేశాడు. సమాచారం మేరకు మైలార్‌దేవ్‌పల్లి వద్ద పట్టుకున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.