Site icon HashtagU Telugu

HashtagU Effect : ‘సెక్స్ వర్లర్క కథనం’పై రాచకొండ సీపీ రియాక్షన్!

Hashtagu

Hashtagu

యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి సమస్యలను తొలగించాలని ప్రభుత్వం భావించింది. అందులోభాగంగా గుట్ట కింద సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని, తాము చేసేవృత్తి మానుకోవాలని ప్రభుత్వం సూచించింది. హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ సమస్యలు తీరలేదు.

ఈ నేపథ్యంలో హ్యాష్ ట్యాగ్ యూ (Hashtagu) సెక్స్ వర్కర్లు పడుతున్న ఇబ్బందులపై ‘‘ఒళ్లు’ అమ్ముకున్నాం.. నేడు ‘బిచ్చం’ అడుక్కుంటున్నాం!’’ అనే కథనం ప్రచురించింది. ఈ స్టోరీని పలువురు సామాజికవేత్తలతో పాటు అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. సెక్స్ వర్కర్ల కథనం వైరల్ కావడంతో రాచకొండ సీపీ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ విషయం మా నోటిస్ కు వచ్చిదంటూ ఆన్సర్ చేశారు.