Site icon HashtagU Telugu

HashtagU CEO Meets CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన ‘Hashtagu ‘ సీఈఓ

Hashataguteam

Hashataguteam

 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిసి అభినందనలు తెలియజేశారు ‘#Hashtag U’ సీఈఓ దినేష్.  ప్రజాపాలన ట్యాగ్ లైన్ తో కొలువుదీరిన రేవంత్ సర్కార్..పరిపాలన లో తనదైన దూకుడు తో సాగుతుందని… ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే..మరోపక్క అభివృద్దే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని తెలుపుతూ సీఎం కు అభినందనలు తెలియజేసారు. ఓ వైపు పాలనపై పట్టు పెంచుకుంటూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సైతం చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ హోదాను పెంచడమే లక్ష్యంగా..తెలంగాణ లో సుస్థిరమైన అభివృద్ధి మరియు సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడమే ద్యేయంగా తన పాలన కొనసాగించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చినట్లు ‘#Hashtag U’ CEO దినేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక డిసెంబర్‌ 7 సీఎంగా రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తొలి రోజే ప్రగతి భవన్ వద్ద ఉన్న గేట్లను తొలగించి… అక్కడ ప్రజల వినతులు స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలైన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిన రేవంత్..ఇచ్చిన మాట ప్రకారం..అధికారం చేపట్టిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు , ఆరోగ్య శ్రీ పెంపు చేసి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఆ ఆతర్వాత ఉచిత కరెంట్ , రూ.500 లకే గ్యాస్ , ఇందిరమ్మ ఇళ్ల పధకం వంటి కీలక హామీలను నెరవేర్చి మాట ఇచ్చే ప్రభుత్వం కాదు..మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఇదే జోష్ తో పార్లమెంట్ ఎన్నికల ఫై దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయడంఖా మోగించారో..అదే విధంగా లోక్ సభ ఎన్నికల్లో కూడా విజయడంఖా మోగించాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ప్రత్యర్థి పార్టీని ఖాళీ అయ్యేలా వ్యూహాలు రచిస్తూ కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసి వారిని ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని..విమర్శలు చేసిన వారికీ..సీఎం రేవంత్ తనదైన సమాధానం చెపుతూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరి తరం కాదు..సీఎం రేవంత్ ను ఎదురుకోవడం ఎవరికీ సాధ్యం కాదని నిరూపించాడు సీఎం రేవంత్ రెడ్డి.

Read Also : Green Fixed Deposit: గ్రీన్ ఎఫ్‌డీ అంటే ఏమిటి..? ఇందులో ఎవరు పెట్టుబ‌డి పెట్ట‌గ‌ల‌రు..?