Site icon HashtagU Telugu

Harish Rao: కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఆ వివరాలు బయటపెట్టాలంటూ డిమాండ్!

Harish Rao (1)

Harish Rao (1)

Harish Rao: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతిభ్రమించిందని,  ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి తనపై చేస్తున్న ఆరోపణ ఒక ఉదాహరణ అని హరీశ్ రావు అన్నారు. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవం అని, అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారని, ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధంమని హరీశ్ రావు సవాల్ విసిరారు.

రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్‌లో ఉన్నాను తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, నా పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తాను. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి.కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనం అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు హరీశ్ రావు.

కోమటిరెడ్డి గారి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని, ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పాలి.అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.