Site icon HashtagU Telugu

Siddipet BRS Camp Office : కాంగ్రెస్ గూండాలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నా – హరీష్ రావు

Siddipet Brs Camp Office

Siddipet Brs Camp Office

సిద్దిపేటలోని తన క్యాంప్ ఆఫీస్ (Siddipet BRS Camp Office) ఫై దాడి అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుతం తెలంగాణ లో రుణమాఫీ వార్ నడుస్తుంది. ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి..అధికారం చేపట్టిన కాంగ్రెస్..ఇప్పుడు అందరికి కాకుండా కొంతమందికే రుణమాఫీ చేయడం పట్ల బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ ఆరోపిస్తుంటే..కాంగ్రెస్ మాత్రం చెప్పినట్లు రుణమాఫీ చేసాం..ఇక హరీష్ కూడా చెప్పినట్లే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రుణమాఫీ నేపథ్యంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) రాజీనామా చేయాలంటూ గత రాత్రి సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో.. వారిని కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాలకు చెందిన మద్దతుదారులు పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చి పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరుపక్షాలను చెదరగొట్టి.. వారిని స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటన ఫై హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు. తన క్యాంప్ ఆఫీస్పై దాడి అప్రజాస్వామికమని , కాంగ్రెస్ గూండాలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ‘పోలీసులు దాడులను ఆపాల్సింది పోయి దాడి చేసిన వారినే కాపాడుతున్నారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండాపోతే సాధారణ పౌరులకు ఎలా భద్రత కల్పిస్తారు? దీనిపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

Read Also : Flex War : ‘దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి’ – బిఆర్ఎస్ పోస్టర్లు