Site icon HashtagU Telugu

KCR : హరీష్ రావు చేతికి కీలక బాధ్యతలు

Harish Rao To Take On Key R

Harish Rao To Take On Key R

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో అడుగుపెట్టిన కేసీఆర్, పార్టీకి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ మరోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్, పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏప్రిల్ 27న ప్లీనరీ సమావేశం నిర్వహించాలని, ఆ రోజున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Rekha Gupta: ఢిల్లీ సీఎంగా మ‌హిళ.. ఎవ‌రీ రేఖా గుప్తా?

బీఆర్ఎస్ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏప్రిల్ 10 నుండి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ కార్యకలాపాలను మరింత మెరుగుపరచడం కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కమిటీల ఏర్పాటుకు ఇంచార్జ్‌గా సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ మహిళా విభాగం ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు పార్టీ చేసిన ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవ చేయాల్సిన అవసరాన్ని కేసీఆర్ నొక్కి చెప్పారు.

Kumari Aunty : రేవంత్ ఫోటో తో మరోసారి కుమారి ఆంటీ వైరల్

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిగా విఫలమైందని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బీఆర్ఎస్ పార్టీనే సరైన ప్రత్యామ్నాయమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత 25 ఏళ్లుగా తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా బీఆర్ఎస్ ప్రజల మద్దతుతో మరింత బలంగా ముందుకు సాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం అనివార్యమని, కేడర్ అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.