Site icon HashtagU Telugu

Harish Rao: తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? సీఎం రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్!

Harish Rao

Harish Rao

Harish Rao: సీఎం రేవంత్ యాదగిరిగుట్ట పర్యటనపై హరీష్ రావు (Harish Rao) కౌంటర్లు వేశారు. ఈ రోజు సీఎం రేవంత్ పుట్టిన రోజు యాదగిరిగుట్ట దేవాలయంలో జరుపుకున్నార‌ని ఆయ‌న అన్నారు. అలాగే కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పి కేసీఆర్ కట్టిన యాదాద్రి నే నీ పుట్టినరోజు చేసుకున్నావని గుర్తు చేశారు. చివరికి మూసి సుందరీకరణలో భాగంగా మంచినీళ్లను కూడా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుండి మూసీకి తరలించుతామని చెప్పిన‌ట్లు ఆయ‌న గుర్తుచేశారు.

ఇప్పుడొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసి కేసీఆర్ మర్చిపోయేలాగా చేస్తానని చెబుతున్నాడు. దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వతంత్రం తెచ్చిన కేసీఆర్‌ను ప్రజలు మర్చిపోరని ఆయ‌న అన్నారు. ఈ భూమి ఉన్నంతకాలం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటారన్నారు. అసలు కేసీఆర్ ఏ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? అని ప్ర‌శ్నించారు. ప్రజల ప్రేమపొందే స్థానంలో రేవంత్ రెడ్డి లేడు, కానీ పోలీసులను పంపించి బెదిరించి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిలో ఉన్నాడని ఆయ‌న మండిప‌డ్డారు.

Also Read: Health Tips : ఏదైనా కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుందా? ఈ సంకేతాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు..!

కనకపు సింహాసనమున.. శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం.. దొనరగ బట్టము కట్టిన.. వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ! ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుందని మ‌రో ట్వీట్‌లో రాసుకొచ్చారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు, సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావు. తప్పు మీద తప్పు చేసి వదరబోతులా ప్రవర్తిస్తున్న రేవంత్ నీ తీరును ప్రజలందరు గమనిస్తున్నారు. నీ పుట్టిన రోజున తండ్రి వయసున్న కేసీఆర్ గారి మీద, తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి మీద, నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం. నీ లాగా వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రి నీ ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండదని అన్నారు.

మూసీ నీళ్ళ మురికితో కడిగినా నీ నోరు మురికి పోదు. నీ వంకర బుద్ధి ఇగ మారదు. నీ లాగా చిల్లరగా మేము మాట్లాడలేము. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి పథంలో నడిపిన గంభీరమైన చరిత్ర మాది. బ్యాగులు మోసి, బ్యాగులు పంచి అడ్డ తోవన అధికారంలోకి వచ్చిన నీచ చరిత్ర నీది. నీ దోపిడిని, నీ దొంగబుద్ధిని నిరూపించి ప్రజా క్షేత్రంలోనే నీకు బుద్ధి చెబుతం. పిచ్చి ప్రగల్బాలు మాని పరిపాలన మీద దృష్టి పెట్టు. నిరంకుశత్వం మాని నిర్మాణాత్మక నిర్ణయాలపై శ్రద్ద వహించు అని మండిప‌డ్డారు.