తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy )పై బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు (HarishRao) తీవ్ర విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో పాల్గొన్న ఆయన, “సీఎం ఎనుముల కాదు.. కోతల రేవంత్ రెడ్డి” అంటూ విమర్శల దాడి చేసారు. రైతులకు అనుసంధానించిన పథకాలన్నింటిలో కోతలు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. రుణ మాఫీ పూర్తిగా చేయలేదని, రైతు బీమా డబ్బులు విడుదల కాలేదని, భరోసా నిధుల రెండో విడత ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో సీఎం కేసీఆర్ పరిమితులు లేకుండా రైతుబంధు పథకాన్ని అమలు చేశారని కొనియాడారు.
Yogandhra 2025 : యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. “ఇదేం పాలన? గాలికి వదిలేసి, రాజకీయ కక్షలు తీర్చుకోవడమే మేం చేస్తుంది” అన్న తీరుగా రేవంత్ వెళ్తున్నాడని అంటూ ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసారని , ఈ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య పరంగా హేతుబద్ధంగా లేవని అన్నారు. “ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, నాటి ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నాడు” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు, అరెస్టులు చేసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మనోధైర్యాన్ని తగ్గించలేరని స్పష్టం చేశారు. ప్రజలను మోసపుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, వారి వైఫల్యాలను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.