Harish Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటలు మార్చడం, మోసం చేయడం మాత్రమే అని పేర్కొన్నారు. ఎన్నికల హామీ ప్రకారం ఆర్ఆర్ఆర్ బాధితులకు హామీ ఇచ్చినంతవరకు, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండటానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం ఆర్ఆర్ఆర్ బాధితులు, రైతులు హరీశ్ రావు వద్దకు వచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన హామీని ఇప్పుడు తిప్పేస్తున్నారని బాధితులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రైతులు, బాధితులు చెప్పినట్లుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యేలు తమ బాధను పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. సర్వేలు చేస్తూ, భూసేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించడాన్ని కఠినంగా విమర్శించారు. భూసేకరణ చట్టం అమలు చేయకుండా, తక్కువ ధరకే భూములు తీసుకోవడాన్ని దారుణమన్నారు బాధితులు.
హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి నేతల నుండి హామీలు ఇచ్చి ఇప్పుడు మాట మార్చడాన్ని దౌర్భాగ్యంగా పేర్కొన్నారు. ఆయన వివరించిన ప్రకారం, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో 40 కిలోమీటర్ల పరిమితి అమలు చేస్తూ, చౌటుప్పల్ మున్సిపాలిటీకి తీవ్ర నష్టం జరుగుతోందని, మధ్యలో రోడ్డు పన్నినందున రైతులు పచ్చని పొలాలు, ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్నారని చెప్పారు.
ఈ ప్రాజెక్టు పరిధిలో భూముల కోల్పోయిన రైతులకు తక్కువ నష్టపరిహారం చెల్లించడం, సర్వేలను బలవంతంగా నిర్వహించడం కూడా హరీశ్ రావు తీవ్రంగా ఆరోపించారు. ఆయన సూచించిన ప్రకారం, భూములు కోల్పోయిన రైతులకు పూర్తిగా సంతృప్తికరమైన పరిహారం ఇవ్వాలని, తదుపరి నిర్ణయాలు రైతుల అంగీకారంతో మాత్రమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు తప్పుడు పద్ధతులు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేసారు. భవిష్యత్తులో ఈ సమస్యపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, అసెంబ్లీలో కూడా ఈ విషయం ప్రస్తావన చేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.
Read Also : Automobile : ద్విచక్ర వాహనాల విక్రయాల్లో భారత్ కొత్త రికార్డు..!