Site icon HashtagU Telugu

Telangana: ఈడీ దాడుల అనంతరం మహిపాల్ రెడ్డిని కలిసిన హరీశ్‌రావు

Telangana

Telangana

Telangana: పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. జూన్ 20 గురువారం నాడు మహిపాల్ రెడ్డి మరియు అతని సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిపై ఈడీ దాడులకు పాల్పడింది. దీంతో హరీష్ రావు ఈ రోజు వారిని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యే లేదా ఆయన కుటుంబ సభ్యుల వద్ద ఎలాంటి అక్రమ డబ్బు, బంగారం కనిపించలేదని తెలిపారు. ఆయన ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అధికారులకు పూర్తిగా సహకరించారు. అయినప్పటికీ ఇంట్లోని పిల్లలు ఏడ్చేంతగా వేధించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమతో కలుపుకుని భయభ్రాంతులకు గురిచేసేందుకే దాడులు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై విచారణపై ప్రశ్నలు లేవనెత్తిన హరీష్ రావు, ఈ కేసులో ఎందుకు చర్య తీసుకోవడం లేదని బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఉల్లంఘిస్తోందని మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన గుప్పిట్లోకి తీసుకోవాలనుకుంటుందని అసహనం వ్యక్తం చేశారు. అన్నారు.

హరీష్ ఇంకా మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ విభాగం మా ఫోన్‌లను ట్యాప్ చేస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఇళ్లపై నిఘా పెట్టి దాడులు చేసి కేసులు పెడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది వాగ్దానాలను అమలు చేయడానికి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమ మైనింగ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడికి సంబంధించిన స్థలాల్లో ఈడీ సోదాలు చేసింది. మధుసూదన్ రెడ్డికి సంబంధించిన క్వారీ కంపెనీ ప్రాంగణంతో సహా దాదాపు ఏడెనిమిది స్థలాల్లో సోదాలు జరిగినట్లు పిటిఐ వర్గాలు తెలిపాయి. ఈ విచారణలో భాగంగా మార్చిలో మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Electric Scooter: భారత మార్కెట్‌లో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర, ఫీచర్లు ఇవే..

Exit mobile version