Harish rao: రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? : హరీశ్ రావు

Harish rao severe criticism of the congress government : పదేళ్లపాటు శాంతి భద్రతల సమస్య రాకుండా బీఆర్ఎస్ పాలన సాగిందని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని.. శాంతిభద్రతలు క్షీణిస్తుండటంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Harish-rao-severe-criticism-of-the-congress-government

Harish-rao-severe-criticism-of-the-congress-government

Harish rao severe criticism of the congress government : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్‌లోని నివాసంలో శుక్రవారం మాట్లాడుతూ..పదేళ్లపాటు శాంతి భద్రతల సమస్య రాకుండా బీఆర్ఎస్ పాలన సాగిందని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని.. శాంతిభద్రతలు క్షీణిస్తుండటంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపుతప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని విమర్శలు గుప్పించారు.

దాడులు చేయించింది..రేవంత్ రెడ్డి, డీజీపీలు కాదా ..?

శాంతి భద్రతలు అదుపు తప్పడానికి చేసిందంతా చేసి భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బందోబస్తు ఇచ్చి దాడులు చేయించింది ఎవరు ..? రేవంత్ రెడ్డి, డీజీపీలు కాదా ..? నిన్నటి దాడులు ఎందుకు ఆపలేదు. అది గాంధీ చేసిన దాడి కాదు రేవంత్ రెడ్డి చేసిన దాడి. మమ్మల్ని ఇవాళ హౌజ్ అరెస్ట్ చేశారు. నిన్న గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టు చేయలేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా. ఖమ్మంలో మా మీద దాడి చేస్తే పది రోజులైనా గుండాల మీద కేసులు పెట్టలేదు. నిన్న జరిగిన దాడికి కర్త,కర్మ, క్రియ అంతా రేవంత్ రెడ్డే. ఆయన డైరెక్షన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది.

ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట..

ఎమర్జెన్సీ కన్నా దారుణంగా రాష్ట్ర పరిస్థితులు తయారయ్యాయి. కోమటి రెడ్డి వెంకటరెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాలని చెప్పడం దారుణం. ఫిరాయింపులపై ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎన్నిక లేకున్నా పీఏసీ చైర్మన్ ను నియమించి ఎన్నిక జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పడం దుర్మార్గం. డీజీపీ పదవి చాలా ఉన్నతమైంది. ఆదర్శంగా ఉండాల్సిన డీజీపీ.. రాజకీయ కుట్రలో భాగమై ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూడాలనుకుంటున్నారు. రాహుల్ గాంధీ దేశం బయట స్వేచ్ఛ స్వాతంత్య్రాల గురించి పాఠాలు చెప్పడం కాదు. తెలంగాణలో ఏం జరుగుతుందో చూడాలి.

ఆంధ్రా నాయకుల మీద రేవంత్ రెడ్డి కపట ప్రేమ..

రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులు జరిగాయి. పీఏసీ చైర్మన్ నియామకం కూడా అలాగే జరిగింది. మీరు మాపై విసిరే రాళ్లే అధికారంలోకి బీఆర్ఎస్ రావడానికి పునాది రాళ్లు. 16వ ఆర్థిక సంఘం గురించి మీరు తప్పుడు లెక్కలు చెబితే, మేము బాధ్యతాయుతంగా బలమైన వాదనను వినిపించాం. ఆంధ్రా నాయకుల మీద రేవంత్ రెడ్డి కపట ప్రేమ వలకబోస్తున్నారు. చిన్న జీయర్ స్వామిని, యాదాద్రి నిర్మాణానికి ప్లాన్ ఇచ్చిన ఆనంద సాయిని ఆంధ్రోడు అని రేవంత్ అన్నారు. మరి దానికి ఏమని సమాధానం చెబుతారు.

ముందు రెచ్చగొట్టింది గాంధీయే..

పీఏసీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా ఇది జరిగింది. కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో నీ పెత్తనం ఏంటని అరికెపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి సమాధానంగానే కౌశిక్ రెడ్డి మాట్లాడారు తప్పా? సెటిలర్ల మీద కౌశిక్ కామెంట్ చేయలేదు. ముందు రెచ్చగొట్టింది గాంధీ. ఆయనకు చెప్పిన సమాధానం అది”అని హరీశ్ రావు తెలిపారు. గురువారం జరిగిన తొక్కిసలాటతో తనకు భుజం నొప్పి మొదలైందని.. డాక్టర్లు ఎమ్మారై స్కాన్ తీసి 15 రోజుల పాటు ఫిజియోథెరపీ సూచించారని హరీశ్ వివరించారు.

పోలీసులను తిట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది..

14 ఏళ్ల ఉద్యమకాలంలోనూ ఇలాంటి అణిచివేతలు చూడలేదని తెలిపారు. రాష్ట్ర డీజీపీ బాధ్యాయుతంగా వ్యవహరించాలని కోరారు. గతంలో పోలీసులను తిట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని గుర్తుచేశారు. అరికెపూడి గాంధీని నిన్ననే హౌజ్ అరెస్ట్ చేసి ఉంటే.. కౌశిక్ రెడ్డిపై దాడి జరిగి ఉండేది కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళితే.. డీజీపీని ఇష్టమొచ్చినట్లు తిట్టారు. నిన్న తమను అరెస్ట్ చేస్తుంటే పోలీసులకు సంపూర్ణంగా సహకరించాం. ఇది కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఉన్న తేడా? అని అన్నారు.

Read Also: Raja Singh : పదవీ లేక కేటీఆర్‌కు పిచ్చి పట్టింది: రాజాసింగ్

  Last Updated: 13 Sep 2024, 05:43 PM IST