Site icon HashtagU Telugu

TG Assembly : సీఎం రేవంత్ భాష ఫై హరీష్ రావు సెటైర్లు

Harish Rao Tg Assembly

Harish Rao Tg Assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) వాడివేడిగా నడుస్తున్నాయి. గురువారం అసెంబ్లీ మంత్రి భట్టి ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Telangana Budget 2024-25)ఫై ఈరోజు శనివారం చర్చ జరిగింది. భట్టి ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితమైందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగమైన పెన్షన్ పెంపు హామీ ఏమైందని ప్రశ్నించారు. ‘గ్రామాల్లో ముసలివాళ్లు రూ.4వేల పెన్షన్ ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. సన్నవడ్లకే రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పాలకులు మోసం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. 500 మర్డర్లు, 10వేల దొంగతనాలు, 1800 రేప్ కేసులు నమోదయ్యాయి’ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయ కక్షతో కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను నిలిపివేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ను కొనసాగించాలన్నారు. అవసరమైతే ఆ పథకాల ముందు కేసీఆర్ పేరును తొలగించాలన్నారు. రాజకీయాల కోసం గర్భిణులను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. రేపటి భవిష్యత్తును దెబ్బతీయొద్దని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో మాతాశిశు మరణాల రేటును తగ్గించామని గుర్తు చేశారు. ఇక సీఎం రేవంత్ ఫై ఇదే సందర్బంగా సెటైర్లు వేశారు. ‘ప్రతిపక్షంపై సీఎం ఫ్రస్టేషన్లో రగిలిపోతుంటారు. ఆయన మాటలు ఎట్లుంటాయి అంటే.. పేగులు మెళ్లో వేసుకుంటా. కనుగుడ్లతో గోటీలాడతా. లాగుల్లో తొండలు వదులుతా. పండబెట్టి తొక్కుతా. గోచీలు, లాగులు ఊడగొడతా అంటూ ఆయన రాక్షస భాషలో చెలరేగిపోతుంటే సామాన్య ప్రజలు సీఎంను ఏమీ అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు’ అని ఎద్దేవా చేశారు. అలాగే భట్టి కి సవాలు విసిరారు. ‘కాసేపు అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ బ్రేక్ ఇస్తే నేను, భట్టి గన్ పార్క్ వద్ద నిలబడుతాం. అక్కడ వెళ్లే జనం ఎవరి పాలనలో కరెంట్ బాగుందో వారే చెప్తారు. దీనికి సిద్ధమా?’ అని ప్రశ్నించారు.

Read Also : iPhone Prices : ఐఫోన్ల రేట్లు డౌన్.. కారణం ఏమిటో తెలుసా ?