Harish Rao: క్లినెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా గా ‘సిద్దిపేట‘

  • Written By:
  • Updated On - January 14, 2024 / 05:42 PM IST

Harish Rao: సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వచ్ సర్వేక్షన్ లో దక్షణ భారత దేశంలోనే సిద్దిపేట కు క్లిన్ సిటీ అవార్డ్ వచ్చిన నేపథ్యం లో మున్సిపల్ కార్మికులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సన్మానించారు. ఈ ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడారు. ‘‘ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ తో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. క్లినెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా గా సిద్దిపేట అవార్డు (చెత్త సేకరణ లో సమర్థవంతంగా నిర్వహణ) సాధించడం మనందరికీ గర్వకారణం. ఇందుకు కృషి చేసిన మున్సిపాలిటీ, కౌన్సిలర్లు ,అధికారులకు అభినందనలు.  ఈ అవార్డు సిద్దిపేట ప్రజలకు అంకితం. ప్రజల భాగస్వామ్యం లేనిది, అనుకున్న లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదు. సిద్దిపేట వారి సొంత ఇంటిగా భావించి, శుద్దిపేట గా నిలబెట్టారు. అదరికి మరొక్క సారి అభినందనలు, శుభాకాంక్షలు’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘వైద్యులు రోగాలు వచ్చిన తర్వాత చికిత్స అందిస్తే, మీరు రోగాలు రాకుండా కాపాడుతున్న సామాజిక వైద్యులు.  ప్రజల ప్రాణాలు కాపాడుతున్న సఫాయి అన్నా మీకు సలాం. మున్సిపల్ అధికారులు సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నా. అభివృద్ధి చెందిన దేశాల్లో రోడ్లు క్లీన్ గా ఉంటాయి, అక్కడ పరిశుభ్రత బాగుంటుంది అని అంటుంటారు. నిజమే అక్కడ క్లీన్ గా ఉంటాయి. అది అధికారులు లేదా అక్కడి ప్రజా ప్రతినిదుల ఘనత మాత్రమే కాదు. ప్రజల గొప్పతనం కూడా’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘చెత్త వేయడం, సఫాయి వారు వచ్చి తీయటం కాదు. అసలు చెత్తను అక్కడి ప్రజలు రోడ్ల మీద వేయరు. చాక్లెట్ కవర్ అయినా జేబులో పెట్టుకొని వెళ్లి డస్ట్ బిన్ లో వేస్తారు. మన సిద్దిపేట ప్రజలు కూడా అలా ఉన్నతంగా ఆలోచించే స్థాయికి వెళ్ళారు. ఒకనాడు ఒక ఆటో డ్రైవర్ తమ్ముడు మాట్లాడే వీడియో చూసా. కొత్తగా సిద్దిపేటకు వచ్చిన ఓ ప్యాసింజర్ కు చెబుతున్నడు. చాక్లెట్ కవర్ అయినా, చిత్తు కాగితం అయినా డస్ట్ బిన్ లోనే వేస్తాం అని. నాకు కడుపు నిండిన సంతోషం కలిగింది. ప్రజల్లో ఇంత పెద్ద మార్పు రావడం వెనుక అధికారులు, ప్రజా ప్రతినిధుల కృషి ఉంది. మీకు అభినందనలు’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.