Harish Rao Press Meet: ప్రభుత్వాలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బీజేపీది!

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ

Published By: HashtagU Telugu Desk
Harish Rao

Harish Rao

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడం బీజేపీ డీఎన్‌ఏగా మారిందని అన్నారు.

ప్రభుత్వాలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బీజేపీదని హరీశ్ రావు విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ, వివిధ రాష్ట్రాల్లోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ కూడా చేర్చుకుందని అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను బీజేపీ ఎలా ఎత్తి చూపుతుందని ప్రశ్నించారు.

Also Read:  Capital Vizag: దొర‌క‌ని దొర‌లు! అమ‌రావ‌తిని త‌ల‌ద‌న్నే విశాఖ భూ దందా!

గుజరాత్‌లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, సిక్కింలో 13 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని గుర్తు చేశారు. ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజును అనర్హులుగా ప్రకటించాలంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న ఫిర్యాదు రెండేళ్లుగా పెండింగ్‌లో ఎందుకు ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హరీశ్‌ అన్నారు. రైతు బీమా, పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు లబ్ధి పొందారని తెలిపారు. 100 కోట్లు ఇచ్చినా తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి లొంగలేదని హరీశ్ అన్నారు.

Also Watch :

  Last Updated: 31 Oct 2022, 03:54 PM IST