Site icon HashtagU Telugu

Siddipet : మురికి కాలువలో స్వయంగా చెత్తను తొలగించిన మంత్రి హరీశ్‌ రావు

mana chetta mana badhyatha program

mana chetta mana badhyatha program

నడకతో ఆరోగ్యం.. చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని చెయొచ్చు అంటూ మరో సంస్కరణకు సిద్ధిపేట (Siddipet) మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. నిత్యం వేకువజామున పట్టణ ప్రతీ వార్డులో కలియ తిరుగుతూ ప్రజలకు చెత్తోపదేశం చేస్తున్నది. ఇందులో భాగంగా సిద్దిపేటలోమన చెత్త-మన బాధ్యత అంటూ హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 18వ వార్డులో నడుస్తూ మురికి కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, కుర్ కురే ప్యాకెట్లు, చాకలెట్ వెఫర్లు, వాటర్ గ్లాసులు, ఛాయ్ గ్లాసులు, శానిటరీ వేస్ట్ చెత్తను మంత్రి హరీశ్ రావు స్వయంగా ఎత్తి సంచిలో వేశారు.

చెత్త పేరుకుపోవడంతో అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని , ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. మన చెత్త, మన బాధ్యత అంటూ పలు గృహిణీలకు చెత్త పేరుకుపోతే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. నిన్న ఆదివారం జీహెచ్‌ఎంసీ (GHMC) ఆధ్వర్యంలో దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా కోకాపేటలోని తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేసిన విషయం తెలిసిందే.

Read Also:  Vijayashanthi: బీజేపీ పై రాములమ్మ అసంతృప్తికి కారణమిదే!