Harish Rao : ప్ర‌త్యేక హోదా,విశాఖ ఉక్కు నినాదం! BRS స్కెచ్

ఏపీ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంద‌డానికి బీఆర్ఎస్ (Harish Rao)అడుగులు వేస్తోంది.

  • Written By:
  • Updated On - April 13, 2023 / 05:51 PM IST

ఏపీ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంద‌డానికి బీఆర్ఎస్ (Harish Rao) వ్యూహాత్మ‌క అడుగులు వేస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశాన్ని వ్య‌తిరేకించిన ఆ పార్టీ ఏపీ ఎంట్రీకి మార్గాన్ని సుగ‌మ‌మం చేసుకుంటోంది. అంతేకాదు, ప్ర‌త్యేక‌హోదాను (Special status) కూడా ఇప్పుడు తెర‌మీద‌కు తీసుకొచ్చింది. ప్ర‌జల‌ను మానసికంగా ట‌చ్ చేసిన అంశాలు ప్ర‌త్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశాలు. ఆ రెండు అంశాల‌ను ఇప్పుడు బీఆర్ఎస్ ఎత్తుకుంది. అంతేకాదు, ఏపీలోని అధికార‌ప‌క్షం, ప్ర‌తిప‌క్షాన్ని టార్గెట్ చేసింది. కేంద్రం ఏమి చేసినా అధికార ప‌క్షం అడ‌గ‌దు, ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నించ‌దు అంటూ మంత్రి హ‌రీశ్ రావు చుర‌క‌లు వేయ‌డం గ‌మ‌నార్హం.

ఏపీ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంద‌డానికి బీఆర్ఎస్ (Harish Rao)

ఏపీ రోడ్లు, వెనుక‌బాటును చూపిస్తూ తెలంగాణ ప్ర‌గ‌తిని ఇటీవ‌ల బీఆర్ఎస్(Harish Rao) నేత‌లు పోల్చుతున్నారు. అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట ఇలాంటి పద్ధ‌తిని అనుస‌రిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఏపీలో ఏముంది? ఆడా ఈడా ఎందుకు ఈడ‌నే ఓటు చేర్చుకోండ‌ని పిలుపునిచ్చారు. దానిపై ఏపీ మంత్రులు ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దిగారు. తెలంగాణ‌లో ఏముందని ప్ర‌శ్నించారు. దానికి స‌మాధానం ఇస్తూ తెలంగాణ‌లో ఏముందే ప్ర‌శ్నించిన మంత్రులు వ‌స్తే తెలుస్తుంద‌ని అన్నారు. `తెలంగాణ‌లో56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉంది. కెసిఆర్ కిట్ ఉంది. కళ్యాణ లక్ష్మి ఉంది. ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉంది` అంటూ ప‌థ‌కాల‌ను మంత్రి హ‌రీశ్ రావు గుర్తు చేశారు.

ప్ర‌త్యేక హోదా, విశాఖ ప్రైవేటీక‌ర‌ణ అంశాల‌ను తెర‌మీద‌కు

ప్రత్యేక హోదా (Special status) కేంద్రం ఇవ్వ‌క‌పోయినా ఎందుకు అడ‌గ‌డంలేద‌ని మంత్రి హ‌రీశ్ ఏపీ మంత్రుల‌ను నిల‌దీశారు. విశాఖ ఉక్కు ను తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఏపీలో ఉందని విమ‌ర్శించారు. అధికార పార్టీ అడగదు ప్రతి పక్షం ప్రశ్నించదు. రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి అది మీకే మంచిది అంటూ ఏపీ మంత్రుల‌కు(Harish Rao) చుర‌క‌లు వేశారు. సంగారెడ్డి జిల్లాకు వెళ్లిన ఆయ‌న ఆత్మీయ స‌మ్మేళ‌నాలు పెడుతున్నారు. ఆ సంద‌ర్భంగా ఏపీ మంత్రుల‌కు, ప్ర‌తిపక్షానికి చివాట్లు పెట్టారు.

అమ‌రావ‌తి ప్రాజెక్టు రియ‌ల్ ఎస్టేట్ రంగం తెలంగాణ‌ను ఆకాశానికి..

ఉమ్మ‌డి ఏపీ విడిపోయిన త‌రువాత తొలి సీఎం చంద్ర‌బాబు ఆంధ్రాకు ఉన్నారు. ఆయ‌న హ‌యాంలో ఏపీ, తెలంగాణ స‌మాంత‌రంగా అభివృద్ధి చెందుతూ వ‌చ్చాయి. కానీ, 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలో రావ‌డంతో తెలంగాణ పుంజుకుంది. అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లింది. అమ‌రావ‌తి ప్రాజెక్టు మూల‌న‌ప‌డింది. దీంతో రియ‌ల్ ఎస్టేట్ రంగం తెలంగాణ‌ను ఆకాశానికి తీసుకెళ్లింది. ఆ విష‌యాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు, హ‌రీశ్‌,(Harish Rao) కేటీఆర్ ప‌లుమార్లు చెప్పారు. రాజ‌కీయంగా లోపాల‌ను చెప్ప‌గ‌లంగానీ చంద్ర‌బాబు విజ‌న్ ను ఎవ‌రూ కాద‌న‌లేర‌ని మంత్రి కేటీఆర్ పారిశ్రామిక వేత్త‌ల స‌ద‌స్సులో ప్ర‌స్తుతించారు. అంటే, అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాజెక్టు ఉంటే ఏపీ ఎలా ఉండేదో, బీఆర్ఎస్ నేత‌ల‌కు బాగా తెలుసు. ప్ర‌త్యేకించి కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్‌, క‌విత‌ల‌కు అవ‌గాహ‌న ఉంది. అందుకే, 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును దింపే వ‌ర‌కు నిద్ర‌పోలేదు.

Also Read : Harish Rao: ఆంధ్ర ఓటర్లపై కన్నేసిన బీఆర్ఎస్

ఇప్పుడు జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి ఏపీ మీద ప‌లు ర‌కాలుగా సానుభూతిని క‌ల్వ‌కుంట్ల కుటుంబం ప్ర‌క‌టిస్తుంది. రెండో రోజులుగా హ‌రీశ్ రావు ఏపీ గురించి ఏదో ఒక ర‌కంగా ప్ర‌స్తావ‌న తీసుకొస్తున్నారు. సెటిల‌ర్ల ఓట్లు లేకుండా మూడోసారి అధికారం క‌ష్ట‌మ‌ని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే, ప్ర‌త్యేక హోదా,(Special status) విశాఖ ప్రైవేటీక‌ర‌ణ అంశాల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. వాటి ని ఎలివేట్ చేయ‌డం ద్వారా ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. అందుకే, టీడీపీ, వైసీపీని విమ‌ర్శిస్తూ హ‌రీశ్ కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

 

Also Read : BRS Meeting: బీఆర్ఎస్ ఆత్మీయ సభలో విషాదం…