Site icon HashtagU Telugu

LRS : ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లపై సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ

Harishrao Savel Revanth

Harishrao Savel Revanth

ఎన్నికల సమయంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ (LRS) పథకాన్ని ఉచితంగా అమలు చేస్తామని చెప్పి..ఇప్పుడు ఫీజులు వసూళ్లు చేయడం ఏంటి సీఎం (CM Revanth Reddy) గారు అంటూ మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) సీఎం కు బహిరంగ లేఖ రాసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎల్ఆర్ఎస్ ఫీజు పేరుతో ప్రభుత్వం పేద ప్రజల రక్తమాంసాలను పీల్చడమే లక్ష్యంగా చేసుకుందని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కరువైందని హరీష్ రావు ఆరోపించారు. టార్గెట్లు పెట్టి మరీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. నాడు ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అని చెప్పిన ప్రభుత్వమే.. నేడు అదే ఎల్ఆర్ఎస్ పేరుతో ఎందుకు దోపిడీ చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ఫీజు పేరుతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి.. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినంక బోడి మల్లన్న అన్న చందంగా ఉందన్నారు. అప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టొద్దని చెప్పి.. ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ పేరుతో దందా సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం, ఎల్ఆర్ఎస్ (భూముల క్రమబద్దీకరణ) పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఒకవైపు రుణమాఫీ కాక, రైతు బంధు రాక రైతన్నలు ఆవేదన చెందుతుంటే, మరోవైపు విషజ్వరాలతో సామాన్య ప్రజలు ఆసుపత్రుల పాలై, ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారు. ఇలాంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన మీ ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ స్థాయి నుంచి పంచాయతీ సెక్రెటరీ వరకు ఉన్న యంత్రాంగం మీద తీవ్ర ఒత్తిడి చేస్తున్నది. పంచాయతీ సెక్రెటరీలు, బిల్ కలెక్టర్లు రోజుకు మూడు నాలుగు సార్లు ఫోన్లు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారు. ఫీజులు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ టార్గెట్లు పెట్టి మరీ మొత్తం 15వేల కోట్లు వసూళ్లు చేయాలని ఆదేశాలివ్వడమంటే ప్రజల రక్తమాంసాలను పీల్చడమే. మీ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ లేఖలో పేర్కొన్నారు.

Read Also : Champai Soren : బీజేపీ బిగ్ ఆఫర్.. చంపై సోరెన్‌ రియాక్షన్ ఇదీ