Harish Rao leads BRS protest at Commissioner’s office : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Koushik Reddy) ఇంటి ఫై కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ (Arekapudi Gandhi) దాడి చేయడాన్ని బిఆర్ఎస్ తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ దాడి ఫై సీఎం రేవంత్ (CM Revanth) స్పందించాలంటూ..ఆయన వెనకుండి ఈ దాడి చేయించారని ఆరోపిస్తుంది. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు హరీశ్ రావు (Harish Rao) కార్యకర్తలతో కలిసి సీపీ ఆఫీస్ (Cyberabad CP Office) కు వెళ్లారు. దీంతో అందరికీ అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో కౌశిక్ కు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి హరీశ్ తో పాటు మరో ముగ్గురు నేతలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. పిర్యాదు అనంతరం హరీష్ రావు మాట్లాడారు.
సీఎం రేవంత్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ వెంటనే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి అక్రమంగా చేర్చుకోవడంతో పాటు, వారినే తిరిగి ఉసిగొల్పి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గం అని మండిపడ్డారు. పైలెట్, ఎస్కార్ట్ ఇచ్చి తమ ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ వాళ్ళను దాడికి పంపారని , సిద్దిపేటలో తన క్యాంపు కార్యాలయంపైన కూడా దాడి జరిగిందని, ఇటీవల ఖమ్మంలో వరద బాధితుల పరామర్శకు వెళ్తే కూడా తమపై దాడి చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు.
కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో స్పీకర్ వెంటనే స్పందించాలని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలనీ హరీష్ డిమాండ్ చేసారు. మాటల్లో ప్రజా పాలన…రాహుల్ గాంధీ చేతుల్లో రాజ్యాంగం. కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మందలిస్తారా లేదా చెప్పాలి అన్నారు.
Read Also : Space Walk : చరిత్రలో తొలిసారిగా స్పేస్ వాక్.. పొలారిస్ డాన్ మిషన్ సక్సెస్