Kaleshwaram Project Commission : కేసీఆర్ విచారణకు హాజరు అవుతున్న క్రమంలో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Kaleshwaram Project Commission : కేసీఆర్ ప్రజల పట్ల చూపిన నిబద్ధత అచంచలమైనదని పేర్కొన్న హరీశ్ “ఇతరులు అధికారం కోసం పరుగులు తీయగా, కేసీఆర్ మాత్రం ప్రజల జీవన విధానాన్ని మార్చేందుకు పాటుపడ్డారు

Published By: HashtagU Telugu Desk
Harish Rao Fire Cabinet Dec

Harish Rao Fire Cabinet Dec

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project Commission Inquiry)లో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు నేడు కేసీఆర్ (KCR) హాజరయ్యారు. గతంలో ఈటల రాజేందర్, హరీష్ రావు వంటి ప్రముఖులు ఇప్పటికే విచారణకు హాజరైన నేపథ్యంలో, ఇప్పుడు కేసీఆర్ విచారణ కీలక మలుపుగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

Investigation : అప్పుడు చంద్రబాబు..ఇప్పుడు కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వినూత్నమైన పథకాల ద్వారా ప్రజల జీవితాలను మార్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. కేసీఆర్ ప్రజల పట్ల చూపిన నిబద్ధత అచంచలమైనదని పేర్కొన్న హరీశ్ “ఇతరులు అధికారం కోసం పరుగులు తీయగా, కేసీఆర్ మాత్రం ప్రజల జీవన విధానాన్ని మార్చేందుకు పాటుపడ్డారు” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న కాళేశ్వరం విచారణను కాంగ్రెస్ పార్టీ కుట్రగా అభివర్ణించిన హరీశ్, ఈ దానితో కేసీఆర్ చేసిన సేవలను ఎవ్వరూ తుడిచిపెట్టలేరని అన్నారు. కమిషన్ విచారణలు వచ్చినా, విమర్శలు ఎదురైనా కేసీఆర్ గొప్పతనాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని హరీశ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన త్యాగాలు ఎవ్వరూ పునరావృతం చేయలేరని పేర్కొంటూ, “జై తెలంగాణ.. జై కేసీఆర్” అంటూ నినదించారు.

  Last Updated: 11 Jun 2025, 11:05 AM IST