Site icon HashtagU Telugu

Kaleshwaram Inquiry : హరీష్ రావు ను కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఏ ఏ ప్రశ్నలు అడిగారంటే !!

Harish Rao Kaleshwaram Comm

Harish Rao Kaleshwaram Comm

తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ(Kaleshwaram Commission Enquiry)లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణ సుమారు 40 నిమిషాలపాటు సాగింది. ఈ సమయంలో హరీశ్ రావుకు మొత్తం 20 ప్రశ్నలు వేయగా, ప్రతి ఒక్కదానికి ఆయ‌న ఆధారాల‌తో సహా సమాధానమిచ్చినట్లు సమాచారం. ఆయ‌న ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై స్పష్టతనిచ్చారు.

CM Revanth Reddy : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..శాఖల కేటాయింపుపై చర్చ..!

విచారణలో ముఖ్యంగా కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పాటు, ప్రాజెక్ట్ డిజైన్ మార్పులు, బ్యారేజీల నిర్మాణంపై ప్రశ్నలు వచ్చాయి. ముఖ్యంగా మేడిగడ్డ నిర్మాణంపై, దీనికి ముందు మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాలపై కమిషన్ ప్రశ్నించగా, మహారాష్ట్ర నుంచి అనుమతులు రాకపోవడం వల్లే మేడిగడ్డను ఎంచుకున్నామని హరీశ్ రావు వివరణ ఇచ్చారు. అలాగే ప్రాజెక్టు డిజైన్‌లు, ప్రభుత్వ జీవోలు, సంబంధిత డాక్యుమెంట్లను కమిషన్‌కు చూపించి తన నిర్ణయాలను సమర్థించుకున్నారు.

హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఎన్ని రోజులు పనిచేశారన్న అంశాన్ని కూడా కమిషన్ పరిశీలించింది. కమిషన్‌కు అన్ని అంశాల్లోనూ పూర్తి స్థాయిలో సహకరించిన హరీశ్ రావు, తాను తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, పారదర్శకంగా ఉన్నాయని వివరించారు. ఈ విచారణతో కాళేశ్వరం కేసులో కీలక దశకు చేరుకుంది.

కమిషన్ కు హరీష్ రావు కు మధ్య జరిగిన ప్రశ్నలు – సమాదానాలు ఇవే

క‌మిష‌న్‌ : జీవో 115 మంత్రుల సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు?
మంత్రుల సబ్ కమిటీ ఏ అంశాలపై స్టడీ చేసింది?

హ‌రీశ్ రావు : రైతులకు ఎక్కువ సంఖ్యలో నీళ్లు అందించడానికి అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.
సబ్ కమిటీలు తుమ్మల నాగేశ్వరరావు ఈటల రాజేందర్ హరీష్ రావు ఉన్నారు.
సీడ‌బ్ల్యూసీ, రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగింది.
మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి… తుమ్మిడిహట్టి వద్ద నుంచి మేడిగడ్డకు మార్చాం.
16 లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే… రిజర్వాయర్ల సంఖ్య పెంచాలని CWC చెప్పింది.
సీడ‌బ్ల్యూసీ సూచనల మేరకే బ్యారేజీలు, రిజర్వాయర్ల సంఖ్య పెంచాం.
మేడిగడ్డ నిర్మాణం ఒక్కరి నిర్ణయం కాదు.. మేడిగడ్డ నిర్మాణానికి ముందు మంత్రులు అధికారులు అనేకసార్లు భేటీ అయ్యారు.
వ్యాప్కాన్స్ సంస్త నివేదికల ఆధారంగా మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాం.
మేడిగడ్డ నిర్మించాలని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం రిపోర్టులు ఇచ్చారు.

క‌మిష‌న్‌ : అన్నారం సుందిళ్ళ లొకేషన్ మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా..?

హ‌రీశ్‌రావు : లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్… టెక్నికల్ రిపోర్టులు ఆధారంగా లొకేషన్స్ మారాయి.
బ్యారేజీలు, ప్రాజెక్టుల లొకేషన్స్ మారడం ఇప్పుడు కొత్తేమీ కాదు.
గతంలో నాగార్జున సాగర్, కాంతనపల్లి లాంటి ప్రాజెక్టులు లొకేషనులు మారాయి.

క‌మిష‌న్ : ప్రాజెక్టుల లొకేషన్‌లు మార్చే అధికారం హై పవర్ కమిటీకి అధికారం ఉందా..?

హ‌రీశ్‌రావు : అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చింది.

క‌మిష‌న్‌ : కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం ఏంటి..?

హ‌రీశ్‌రావు : లోన్స్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.

క‌మిష‌న్‌ : కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ రీపేమెంట్స్ ఎలా చేయాలనుకున్నారు.?

హ‌రీశ్‌రావు : నీళ్లను అమ్మి లోన్లను రీ పేమెంట్ చేయాలి అనుకున్నాము.

క‌మిష‌న్‌ : కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయిందా? అయితే ఇంత చేశారు?

హ‌రీశ్‌రావు : కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు డిలే అయింది.

క‌మిష‌న్‌ : నిర్మాణ సంస్థలకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు?

హ‌రీశ్‌రావు : సాధారణంగా అప్పటి పరిస్థితులు ఆధారంగా సైట్స్ కొంత డిలే అవుతాయి.

క‌మిష‌న్‌ : మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్‌గా నీళ్లు ఇవ్వొచ్చు ఎక్స్‌ప‌ర్ట్ కమిటీ చెప్పిందా..?

హ‌రీశ్‌రావు : డైరెక్ట్ గా నీళ్లు ఇవ్వడానికి సాధ్యం కాదని ఎక్స్‌ప‌ర్ట్ కమిటీ చెప్పింది.

క‌మిష‌న్‌ : కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్లలో స్టోరేజీ చేశారు..?

హ‌రీశ్‌రావు : రిజర్వాయర్ల ద్వారా 141 టిఎంసిల నీళ్లను స్టోరేజ్ చేసాం.

క‌మిష‌న్‌ : బ్యారేజీలలో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లను స్టోర్ చేశారా ?

హ‌రీశ్‌రావు : టెక్నికల్ అంశాలు అధికారులు మాత్రమే చూసుకుంటారు.

క‌మిష‌న్‌ : బ్యారేజీలలో నీళ్లను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా?

హ‌రీశ్‌రావు : బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించలేదు.