Site icon HashtagU Telugu

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు..ఇందులో నిజమెంత..?

Congress government which has collapsed the Electrical System: Harish Rao

Harish Rao key comments on loan waiver guidelines

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల సమయంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. కానీ తెలంగాణ (Telangana) లో మాత్రం ఎన్నికల ముందు..ఎన్నికల తర్వాత కూడా అంతే రసవత్తరంగా సాగుతున్నాయి. కేంద్రం లో ఉన్న బిజెపి (BJP), ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ (Congres)..రెండు పార్టీలు బిఆర్ఎస్ నేతలను (BRS Leaders) లాక్కునే పనిలో పడ్డాయి. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లాక్కునే ప్రయత్నం మొదలుపెడితే, ఎంపిలను బిజెపి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ చక్కటి ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే 09 మంది ఎమ్మెల్యేను చేర్చుకోగా..మరికొంతమందిని కూడా లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

అటు బిజెపి సైతం రాజ్యసభ ఎంపిలను చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే నలుగురు ఎంపీలతో మాట్లాడడం..పలు అంశాలు గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే , మాజీ మంత్రి , కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు (Harish Rao) బిజెపి లోకి వెళ్తున్నారని వార్తలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా కేటీఆర్ , హరీష్ రావు లు నాల్గు రోజుల పాటు ఢిల్లీ లో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న కవిత బెయిల్ కు సంబంధించి వీరు ఢిల్లీ వెళ్లారని అంత అనుకుంటున్నారు. కానీ అసలు కథ వేరే ఉందని, హరీష్ రావు బిజెపి లో చేరే అంశంపై నాల్గు రోజులు అక్కడ ఉన్నారని అంటున్నారు. ఢిల్లీ పెద్దలతో హరీష్ సమావేశమయ్యారని..హరీష్ బిజెపి లో చేరితే , కవిత కేసు నుండి బయట పడే ఛాన్స్ ఉంది అన్నట్లు బిజెపి నేతలు హరీష్ రావు తో మాట్లాడినట్లు ఓ వార్త హల్చల్ చేస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ హరీష్ ..బిజెపి లో వెళ్తున్నాడనే వార్త వైరల్ గా మారింది.

అలాగే అతి త్వరలో ఈటెల కు బిజెపి రాష్ట్ర అధ్యక్షా పదవి అప్పజెప్పేందుకు బిజెపి అధిష్టానం సిద్ధం అవుతుందని అంటున్నారు. ఈటెల అద్యక్ష పదవి కట్టబెట్టి, బిఆర్ఎస్ నేతలను బిజెపిలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేయబోతుందట. అలాగే హరీష్ రావు బిజెపి లోకి వస్తే..ఇక బిఆర్ఎస్ నేతలంతా బిజెపి లో చేరడం ఖాయమని బిజెపి అధిష్టానం ప్లాన్ చేస్తుంది. మరి హరీష్ రావు బిజెపి లోకి వెళ్తారా..? ఈ వార్తల్లో అసలు నిజం ఉందా ..? అనేది చూడాలి.

Read Also : T20 World Cup: వరల్డ్ కప్​లో బెస్ట్ డెలివరీస్ పై ఐసీసీ