Site icon HashtagU Telugu

Janwada Farm House : ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది – హరీష్ రావు

Harish Rao Janwada Farmhous

Harish Rao Janwada Farmhous

ఉదయం నుండి మీడియా లో జన్వాడ ఫామ్ హౌస్ (Janwada Farm House) ఇష్యూ.. హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ (Rave Party) జరిగిందని, పార్టీలో ఉన్న వారికి డ్రగ్స్ టెస్టు చేస్తే.. విజయ్‌ మద్దూరికి కొకైన్ పాజిటివ్ వచ్చిందని , రేవ్ పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యం, గేమింగ్‌ కాయిన్స్‌, క్యాసినో మెటీరియల్‌ గుర్తించారని, రాజ్‌పాకాలపై NDPS, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తుంది. ఈ వ్యవహారం పట్ల బిజెపి , కాంగ్రెస్ నేతలు కేటీఆర్ (KTR) ను టార్గెట్ చేస్తుండగా..బిఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ పార్టీ పై విమర్శలకు దిగింది.

తాజాగా దీనిపై హరీష్ రావు (Harish Rao) ..ట్విట్టర్ వేదికగా స్పందించారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌పై బురదజల్లడంలో భాగంగానే కేటీఆర్‌ బావమరిదిపై డ్రగ్స్ కేసంటూ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. ప్రజల దృష్టి మళ్లించేందుకు సృష్టించేందుకే జన్వాడ ఫాంహౌజ్‌‌లో డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తోంది. రాజ్‌ పాకాల నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్‌ ఉన్నదని ముందుగానే ప్రభుత్వ పెద్దలకు తెలుసు.

గత రెండు రోజుల నుంచి రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా విభాగం శని, ఆదివారాల్లో బాంబులు పేలుతాయని అనడం, చెప్పినట్లుగానే ఇళ్లపై దాడులు చేయడం చూస్తే, ముందస్తు ప్రణాళికగా ఇది ప్రభుత్వం రూపొందించిన స్కెచ్ అని స్పష్టం అవుతోంది. ఫ్యామిలీ ఫంక్షన్‌‌పై దాడిచేసి దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వృద్ధులు, చిన్నపిల్లలు, భార్యాభర్తలు ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్, ఆయన సతీమణి గానీ ఆ ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లకపోయినా వెళ్లినట్టు చిత్రీకరించడం గర్హనీయం. కేటీఆర్‌ వ్యక్తిత్వాన్ని, ఇమేజ్‌‌ను దెబ్బతీసే ప్రయత్నం రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వం చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరేమీ కాదు.

పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగవద్దని, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలని, వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా ప్రవర్తించవద్దని నా విజ్ఙప్తి. రోజురోజుకు ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టిమళ్లించేందుకే ఈ డ్రామా ఆడుతున్నారు. రాజకీయాల్లో నేరుగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని చీప్ పాలిటిక్స్ చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాను” అంటూ హరీష్ రావు పేర్కొన్నారు.

Read Also : Black Bommidai Fish : 8 అడుగుల పొడవు నల్ల బొమ్మిడాయి చేప.. రేటు, టేస్టు వివరాలివీ