Site icon HashtagU Telugu

Sama Ram Mohan Reddy : బీజేపీ లోకి హరీశ్ రావు – కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

Samu

Samu

బిఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఫై కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy ) సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు బిజెపిలోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారని.. హరీశ్ రావును బీజేపీలోకి పంపేందుకు కేసీఆర్ కొత్త ఆలోచన చేస్తున్నారని సామ రామ్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు.

అల్లుడు హరీశ్ రావును బీజేపీలోకి పంపి పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి.. నేను తిట్టినట్టు చేస్తా అనే మీ పాత ఎత్తుగడలు అర్థం కాక మీ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ఆగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. బిడ్డ కోసం, పార్టీ కోసం, ఆస్తుల కోసం అల్లుడు హరీశ్ భుజం పై తుపాకీ పెట్టి కాల్చే కుట్రలను తెలంగాణ గమనిస్తోందని ధ్వజమెత్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక నిన్న ఆదివారం ఢిల్లీ లో ప్రధాని మోడీతో పాటు 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈసారి తెలుగు రాష్ట్రాలకు మోడీ పెద్ద పీఠం వేశారు. తెలంగాణ తరఫున కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కాగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మకు మోడీ మంత్రివర్గంలో చోటు దక్కింది. తెలంగాణ, ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని వారిని కోరారు.

ఇదిలా ఉంటె తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​ నియామకం కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలో అమిత్​ షాను కలవడానికి ఈటల రాజేందర్​ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.

Read Also : Modis First Signature : ప్రధానిగా తొలి సంతకం చేసిన మోడీ.. ఆ ఫైలుపై సిగ్నేచర్ !